Site icon HashtagU Telugu

Boss Party Full Song: డీజే వీరయ్య.. అదిరిందయ్యా నీ పార్టీ!

Boss Party

Boss Party

గాడ్ ఫాదర్ స‌క్సెస్‌తో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఆ సినిమా విజయంతో ‘వాల్తేరు వీరయ్య’ షూటింగ్ ను శరవేగంగా చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన బాస్ పార్టీ సాంగ్ ప్రోమో మెగా ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. తాజాగా బాస్ పార్టీ ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ కి బాస్ పార్టీ అనే టైటిల్ పెట్టారు. చిరంజీవి మాస్ లుక్ లో కనిపించి హుషారెత్తించాడు. లుంగీ కట్టుకొని, చేతిలో సీసా పట్టుకొని వేసిన మాస్ స్టెప్పులు అభిమానులకు కిక్ ఇస్తున్నాయి.

సాంగ్ చివర్లో ‘డీజే వీరయ్య.. అదిరిపోయింది పార్టీ’ తన వాయిస్ తో అదరగొట్టాడు చిరు. చిరంజీవి కీ రోల్ లో నటిస్తుండటంతో ‘వాల్తేరు వీరయ్య’ పై అంచనాలు ఏర్పడ్డాయి. చిరంజీవి మాస్ అవతార్, DSP వాయిస్ సాంగ్ ఎనర్జిటిక్‌గా ఉంది. ఈ ట్రాక్ మాస్‌కి ఫీస్ట్‌గా ఉండబోతోంది.  ఈ పూర్తి పాటను కొద్దిసేపటి క్రితమే విడుదల చేయగా, చిరు అభిమానులు పదే పదే వీడియోను చూస్తు ఎంజాయ్ చేస్తున్నారు. శృతిహాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి బాబీ కొల్లి దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ 2023 సంక్రాంతికి సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేశారు.

Exit mobile version