Site icon HashtagU Telugu

Megastar Chiranjeevi: ‘ముల్లోక వీరుడు’గా మెగాస్టార్, ఎనిమిది హీరోయిన్స్ తో చిరు రొమాన్స్?

Chiranjeevi

Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి ఈ తరం యువ హీరోలతో పోటీ పడి మరి నటిస్తున్నారు. ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. వరుసగా సినిమాలు చేసుకుంటూ టాలీవుడ్ లో దూసుకుపోతున్నాయి. ఇప్పటికే గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య సినిమాలతో ఆకట్టుకున్న చిరంజీవి భోళా శంకర్ తో త్వరలో మన ముందుకు రాబోతున్నాడు. అయితే తాజాగా ఆయన మరో సినిమాకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ‘

బింబిసార’ సినిమాతో దర్శకుడిగా తానేమిటనేది నిరూపించుకున్న వశిష్ఠ మరో సోషియో ఫాంటసీ తెరకెక్కించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ కథను మెగాస్టార్  చిరంజీవికి చెప్పి, ఆయన ఒకే చెప్పినట్టు టాలీవుడ్ టాక్. ఇక  ఈ సినిమాలో ఏకంగా ఎనిమిదిమంది కథానాయికలు కనిపించనున్నారని తెలుస్తోంది. వర్కింగ్ టైటిల్ గా ‘ముల్లోక వీరుడు’గా పరిశీలించినట్టు సమాచారం.

‘భోళాశంకర్’ రిలీజ్ తరువాత ఈ ప్రాజెక్టు పై క్లారిటీ రానుందని అంటున్నారు. చిరంజీవి, రాఘవేందర్ రావు కాంబినేషన్ లో వచ్చిన ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ టాలీవుడ్ లో ఓ ట్రెండ్ సెటర్. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అదరిపొయే కలెక్షన్లను రాబట్టడమే కాకుండా, టాలీవుడ్ కు మరిచిపోలేని హిట్ ను అందించింది. ఈ నేపథ్యంలో చిరంజీవినే మరోసారి సోషియో ఫాంటసీ సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

Also Read: Srisailam: శ్రీశైలంలో ఘనంగా మహా మృత్యుంజయ హోమం!

Exit mobile version