Site icon HashtagU Telugu

Mega vs Allu : అల్లు అర్జున్ కంటే రామ్ చరణ్ తోపా ?

Ramcharan Alluarjun

Ramcharan Alluarjun

చిత్రసీమ(Tollywood)లో గత కొద్దీ రోజులుగా మెగా vs అల్లు వార్ (Mega vs Allu) నడుస్తున్న విషయం అందరికి తెలిసిందే. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గురించి చెప్పను బ్రదర్..అని అల్లు అర్జున్ (Allu Arjun) ఎప్పుడైతే అన్నాడో , అప్పటి నుండి మెగా అభిమానులు అల్లు అర్జున్ ను దూరం పెట్టడం మొదలుపెట్టారు. కేవలం మెగా అభిమానులే కాదు మెగా ఫ్యామిలీ సైతం దూరం పెడుతూ వస్తుంది. కాకపోతే చిరంజీవి(Chiranjeevi) పెద్ద తరహాలో అల్లు ఫ్యామిలీ ఈవెంట్స్ కు హాజరు అవుతాడు తప్పితే మెగా హీరోలు పెద్దగా కనిపించిన దాఖలు లేవు. రీసెంట్ గా అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత చిరంజీవి , నాగబాబు స్వయంగా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లడం, ఆ తర్వాత అల్లు అర్జున్ చిరంజీవి , నాగబాబు ఇంటికి వెళ్లి కలవడం చేసేసరికి మళ్లీ రెండు ఫ్యామిలీ లు కలిసిపోతున్నాయి అని అంత మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.

ఈ తరుణంలో దిల్ రాజు పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలవడం, గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ రావాలని కోరడం , దానికి పవన్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం , అలాగే అల్లు అర్జున్ అరెస్ట్ అంశంపై కూడా ఇద్దరు మాట్లాడుకున్నట్లు వార్తలు బయటకు రావడం జరిగింది. ఈరోజు మీడియా చిట్ చాట్ లో మీడియా వారు అల్లు అర్జున్ అరెస్ట్ విషయంపై పవన్ కళ్యాణ్ ను పలు ప్రశ్నలు సంధించారు. దీనికి ఆయన చెప్పిన సమాదానాలు మెగా అభిమానుల్లో కాస్త సందేహం మొదలయ్యేలా చేసాయి. అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో సీఎం రేవంత్ చేసిన తీరు పట్ల ఏమాత్రం అసహనం వ్యక్తం చేయలేదు..అలాగనీ అల్లు అర్జున్ ను తప్పు పట్టలేదు. ‘గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చారు. అభిమాని మృతి చెందిన తర్వాత వెంటనే వాళ్ల ఇంటికి వెళ్లి పరామర్శించాలి. మానవతా దృక్పథం లోపించినట్లెంది. బన్నీనే కాదు. టీమ్ అయినా స్పందించాల్సింది. సీఎం రేవంత్ పేరు చెప్పలేదని అరెస్ట్ చేశారనడం సరికాదు. బన్నీ స్థానంలో రేవంత్ ఉన్నా అలానే చేస్తారు’ , అలాగే రేవంత్ రెడ్డి గొప్ప నాయకుడు అంటూ కొనియాడారు. కిందిస్థాయి నుంచి ఎదిగిన గొప్ప వ్యక్తి అని , వైసీపీ తరహాలో సీఎం రేవంత్ ఎక్కడ వ్యవహరించలేదన్నారు. తెలంగాణలో బెనిఫిట్ షోలకు, టికెట్ల ధర పెంపునకు అవకాశం ఇచ్చారు. ఇలా సీఎం రేవంత్ రెడ్డి పై ప్రశంసలు కురిపించడం తో అభిమానుల్లో అల్లు అర్జున్ అరెస్ట్ ను పవన్ సమర్దించారా…? అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అలాగే అల్లు అర్జున్ కంటే రామ్ చరణ్ గ్రేట్ అని కొందరు, లేదు అల్లు అర్జునే గ్రేట్ అని మరికొందరు ఇలా ఎవరికీ వారు వారి వారి అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు. మరి వీటిపై విశ్లేషకులు ఏమంటున్నారో ఈ కింది వీడియో లో చూద్దాం.

Read Also : CM Revanth : సినిమా వాళ్లతో రేవంత్ సెటిల్మెంట్ చేసుకున్నాడు – కేటీఆర్