Mega Surprise ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తేజ సజ్జ, అమృత అయ్యర్ లీడ్ రోల్స్ లో వస్తున్న సినిమా హనుమా. ఇండియన్ సూపర్ హీరో మూవీగా వస్తున్న హనుమాన్ సినిమా ప్రచార చిత్రాలు సినిమాపై భారీ క్రేజ్ ఏర్పడేలా చేశాయి. సంక్రాంతికి రిలీజ్ అవబోతున్న ఈ సినిమా పొంగల్ ఫైట్ లో పెద్ద సినిమాలకు ఏమాత్రం తగ్గని విధంగా వస్తుంది. హనుమాన్ సినిమాను సంక్రాంతికి రాకుండా చేయాలని గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ దర్శక నిర్మాతలు మాత్రం ఎలాగైనా సరే సినిమా రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు.
We’re now on WhatsApp : Click to Join
ఇక హనుమాన్ సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న టైం లో సినిమా నుంచి కొన్ని ఎక్స్ క్లూజివ్ న్యూస్ లు బయటకు వస్తున్నాయి. సినిమాలో మెగా సర్ ప్రైజ్ ఒకటి ఉండబోతుందని తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ఈ సినిమాలో ఉంటుందని అంటున్నారు. హనుమాన్ ప్రియ భక్తుడైన చిరంజీవి హనుమాన్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాకు తనవంతు సహకారం అందించారని తెలుస్తుంది.
అ! సినిమా నుంచి జాంబి రెడ్డి వరకు తన సత్తా చాటిన ప్రశాంత్ వర్మ హనుమాన్ తో కూడా తన టాలెంట్ చూపాలని చూస్తున్నాడు. తన ప్రతి సినిమా సంథింగ్ స్పెషల్ గా ప్లాన్ చేస్తున్న ప్రశాంత్ వర్మ హనుమాన్ తో ఒక సరికొత్త వరల్డ్ సృష్టిస్తాడని అంటున్నారు.
హనుమాన్ మాత్రమే కాదు ప్రశాంత్ వర్మ ఈ సూపర్ హీరో ఫ్రాంచైజ్ లను కొనసాగిస్తారని తెలుస్తుంది. హనుమాన్ సక్సెస్ అయితే మాత్రం ఇలాంటి సూపర్ హీరో సినిమాలు చాలా వస్తాయని చెప్పొచ్చు.
Also Read : Nagarjuna : నాగార్జున నా సామిరంగ రిలీజ్ డేట్ లాక్..!