Chiranjeevi Knee Surgery : ఢిల్లీలో చిరంజీవి మోకాలికి ఆపరేషన్ పూర్తి

చిరంజీవికి ‘నీ వాష్’ సర్జరీ చేసినట్టు సమాచారం

  • Written By:
  • Publish Date - August 15, 2023 / 06:55 PM IST

మెగాస్టార్ చిరంజీవి మోకాలికి ఢిల్లీ లో ఆపరేషన్ చేసారు (Chiranjeevi Knee Surgery). చిరంజీవి నటించిన భోళా శంకర్ రిలీజైన తర్వాత ఢిల్లీకి చెకబ్ కోసమని వెళ్లారు. డాక్టర్లు పరిస్థితిని సమీక్షించి మోకాలికి ఆపరేషన్ చేయాలని తెలిపారు. దీంతో శస్త్ర చికిత్స చేశారు. మరో వారం రోజుల పాటు చిరంజీవి ఢిల్లీలోనే విశ్రాంతి తీసుకుని వచ్చేవారం హైదరాబాద్ రానున్నట్లు తెలుస్తోంది. గతంలో భుజానికి సంబంధించిన సమస్యలతో బాధపడిన ఆయన.. ఇప్పుడు మోకాలు సమస్యతో బాధపడుతుండటంతో మోగా అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చిరంజీవికి ‘నీ వాష్’ సర్జరీ చేసినట్టు సమాచారం. ఈ శస్త్రచికిత్సను ఆర్థ్రోస్కోపిక్ నీ వాషౌట్ అని కూడా అంటారట. అంటే, మోకాలిలో ఉన్న ఇన్ఫెక్షన్ ఈ శస్త్రచికిత్స ద్వారా ఆర్థోప్లాస్టీ చేసి క్లియర్ చేస్తారట. ఇది చిన్న శస్త్రచికిత్సే. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ సాయంతో చేస్తారు. కాబట్టి, చిరంజీవి (Chiranjeevi )కి వారం రోజుల విశ్రాంతి సరిపోతుంది. చిరంజీవికి మోకాలికి శస్త్ర చికిత్స (Knee Surgery) జరగనున్నట్టు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతుండడం తో అభిమానులు కాస్త ఖంగారుకు గురవుతూ వస్తున్నారు. కానీ, ఇప్పుడు పీఆర్ టీమ్ ఇచ్చిన సమాచారంతో వాళ్లకు ఊపిరిపీల్చుకుంటారు. ఇది చిన్న సర్జరీ అని స్పష్టత రావడంతో అన్నయ్య త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

ఇక చిరంజీవి నటించిన భోళా శంకర్ (Bhola Shankar) విషయానికి వస్తే..తమిళ్ లో సూపర్ హిట్ అయినా వేదాళం మూవీ కి రీమేక్ గా మెహర్ రమేష్ తెరకెక్కించారు. కానీ ఈ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. సాంగ్స్ అంతగా బాగా లేకపోవడం..కామెడీ వర్క్ అవుట్ కాకపోవడం..బోరింగ్ సన్నివేశాలు ఉండడం తో ప్రేక్షకులు మొదటిరోజు మొదటి ఆట తోనే నిరాశ వ్యక్తం చేసారు. కాగా నెక్స్ట్ చిరంజీవి సోగ్గాడే చిన్నినాయనా ఫేమ్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో మూవీ చేయనున్నారట. ఈ మూవీలో మరో హీరో శర్వానంద్ నటిస్తున్నారని సమాచారం. ఇది మలయాళ హిట్ బ్రో డాడీ రీమేక్ అనే మాట వినిపిస్తోంది. ఈ మూవీ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత నిర్మించనున్నారు.

Read Also : Bindeshwar Pathak : “సులభ్” విప్లవ యోధుడు బిందేశ్వర్ పాఠక్ ఇక లేరు