Site icon HashtagU Telugu

Budget Problem for Mega Hero Movie : మెగా సినిమాకు షాక్.. బడ్జెట్ ఇష్యూస్ తో సినిమాకు బ్రేక్.. ముందుకెళ్తుందా అటకెక్కుతుందా..?

Mega Shock Budget Problem For Mega Hero Movie

Mega Shock Budget Problem For Mega Hero Movie

Budget Problem for Mega Hero Movie మెగా ఫ్యామిలీ హీరో సినిమాకు బడ్జెట్ కష్టాలు ఏంటి.. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏ హీరో సినిమా అయినా సరే ఎంత బడ్జెట్ పెట్టినా రిటర్న్ వచ్చేస్తాయి కదా మరి అలాంటి మెగా హీరోల సినిమాలకు ఈ బడ్జెట్ కష్టాలు ఏంటని అనుకోవచ్చు..

We’re now on WhatsApp : Click to Join

ఈమధ్య నిర్మాతల మైండ్ సెట్ మారింది. ఇదివరకులా సినిమా బడ్జెట్ ఎంతంటే అంత పెట్టే పరిస్థితి కనబడట్లేదు. కంటెంట్ ఉన్న సినిమాని కూడా సాధ్యమైనంత తక్కువ బడ్జెట్ లో కానివ్వాలని చూస్తున్నారు.

బాహుబలి లాంటి సినిమా వందల కోట్ల బడ్జెట్ తో తీశాక నిర్మాతలకు బడ్జెట్ విషయంలో నో లిమిట్స్ అనే డేర్ నెస్ వచ్చినా కథ డిమాండ్ చేస్తే తప్ప బడ్జెట్ పెట్టేందుకు రెడీగా లేరు. ఇందులో భాగంగానే మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ లేటెస్ట్ సినిమా గాంజా శంకర్ సినిమా బడ్జెట్ ఇష్యూస్ ఫేస్ చేస్తుందని తెలుస్తుంది.

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సంపత్ నంది డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కించాల్సి ఉంది. అయితే ఈ సినిమాకు అనుకున్నంత బడ్జెట్ లో పూర్తి చేసేలా చర్చలు జరిగాయట. కానీ అది సాధ్యం కాదని తెలియడంతో సినిమాను మొదట్లోనే ఆపేసినట్టు తెలుస్తుంది. తేజ్ సినిమాకు ఇలా బడ్జెట్ కష్టాలు రావడం మెగా ఫ్యాన్స్ కి షాక్ ఇస్తుంది.

విరూపాక్ష, బ్రో సినిమాల తర్వాత గాంజా శంకర్ తో రావాలని అనుకున్న సాయి ధరం తేజ్ కి బడ్జెట్ రూపంలో ఊహించని కష్టం ఎదురైంది. మరి ఈ సినిమా ఉంటుందా మొత్తానికే ఆపేస్తారా అన్నది చూడాలి.

Also Read : How Many Times Pappa (Nanna) Word Used in Animal : యానిమల్ సినిమాలో పప్పా కౌంట్.. నాన్న అనే పదాన్ని ఎన్నిసార్లు వాడారో తెలుసా..?