Mega Prince Varun Tej : తమ్ముడికి దిష్టి తగులుతుంది.. అకిరా నందన్ పై వరుణ్ తేజ్ ప్రేమ ఎలా ఉందో చూశారా..?

Mega Prince Varun Tej మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ త్వరలో ఆపరేషన్ వాలెంటైన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో భారీ అంచనాలతో ఈ సినిమా

Published By: HashtagU Telugu Desk
Producers Exit from Varun Tej Movie

Producers Exit from Varun Tej Movie

Mega Prince Varun Tej మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ త్వరలో ఆపరేషన్ వాలెంటైన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో భారీ అంచనాలతో ఈ సినిమా వస్తుంది. సినిమాను తెలుగు, హిందీ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. మార్చి 1న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్నాడు వరుణ్ తేజ్. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేశాడు వరుణ్ తేజ్.

ఈ క్రమంలో ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అకిరా నందన్ తో మీకున్న బాండింగ్ గురించి అడిగాడు. అకిరా తో తనది గొప్ప బాండింగ్ అని. తను ఇప్పుడు ఫారిన్ లో చదువుతున్నాడని. తమ్ముడి గురించి ఇంతకన్నా ఎక్కువ అడగొద్దు తమ్ముడికి దిష్టి తగులుతుందని అన్నాడు వరుణ్ తేజ్. తమ్ముడి మీద వరుణ్ తేజ్ కి చెప్పలేనంత ప్రేమ ఉందని పవర్ స్టార్ ఫ్యాన్స్ ఇటు మెగా ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.

పవన్ వారసుడిగా అకిరా నందన్ తెరగేట్రం కోసం ఫ్యాన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే అకిరా నంద హీరోగా చేసేందుకు సుముఖంగా లేడని టాక్. అతనికి మ్యూజిక్ అంటే చాలా ఇష్టమట అందుకే మ్యూజిక్ కంపోజర్ గా చేయాలని చూస్తున్నాడని తెలుస్తుంది. అయితే అకిరా ఫోటోలు చూస్తే మాత్రం అతను పక్కా హీరో మెటీరియల్ అనిపిస్తుంది.

మెగా ఈవెంట్ గా మెగా ఫ్యామిలీ మొత్తం ఏ ఫంక్షన్ చేసుకున్నా సరే అక్కడ అకిరా నంద, ఆద్యాలు ప్రెజెన్స్ ఉంటుంది. అకిరా నందన్ సినిమాల్లోకి రావాలని పవర్ స్టార్ ఫ్యాన్స్ కోరుతున్నారు.

Also Read : Rajamouli Mahesh Movie : రాజమౌళి మహేష్ సినిమాకు నెట్ ఫ్లిక్స్ ఇన్వెస్ట్మెంట్..?

  Last Updated: 17 Feb 2024, 08:20 AM IST