Sai Dharam Tej : మెగా మేనల్లుడు ఆ టైటిల్ కి ఫిక్స్..!

Sai Dharam Tej మెగా మేనల్లుడు సాయి తేజ్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది. బ్రో తర్వాత సాయి ధరం తేజ్

Published By: HashtagU Telugu Desk
Mega Menalludu Sai Dharam T

Mega Menalludu Sai Dharam T

Sai Dharam Tej మెగా మేనల్లుడు సాయి తేజ్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది. బ్రో తర్వాత సాయి ధరం తేజ్ చేస్తున్న ఈ సినిమా తేజు మార్క్ మాస్ అండ్ కమర్షియల్ సినిమాగా రాబోతుందని టాక్. సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్తుండగా సంపత్ నంది ఈ సినిమాకు టైటిల్ ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. సినిమాకు టైటిల్ గా గంజాయి శంకర్ అని ఫిక్స్ చేశారట మేకర్స్. సినిమా లో సాయి తేజ్ మాస్ లుక్ మాస్ పాత్రలో కనిపిస్తారని చెప్పుకుంటున్నారు.

రిపబ్లిక్ టైం లో యాక్సిడెంట్ వల్ల రెండేళ్లు కెరీర్ వెనక పడ్డ సాయి తేజ్ ఆ తర్వాత విరూపాక్ష (Virupaksha) తో సూపర్ హిట్ అందుకున్నాడు. ఇక ఆ సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో బ్రో (BRO) సినిమా చేశాడు. మామ పవన్ తో స్క్రీన్ షేరింగ్ తేజ్ కెరీర్ కు మరింత ప్రోత్సాహం అందించింది.

Also Read : KCR Hat Trick: కేసీఆర్ హ్యాట్రిక్ గ్యారంటీ: అసదుద్దీన్ ఒవైసీ

మెగా మేనల్లుడు సాయి తేజ్ (Sai Dharam Tej) తన నెక్స్ట్ సినిమా ని మాస్ ఎంటర్టైనర్ గా చేస్తున్నాడు. ఓ పక్క వెరైటీ కథలతో సినిమాలు చేస్తూనే అప్పుడప్పుడు ఫ్యాన్స్ కోరుకునే మాస్ సినిమాలు చేయాలి లేకపోతే ఫ్యాన్స్ ఫీల్ అవుతారు. సంపత్ నంది అంటేనే మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్. రాం చరణ్ తో రచ్చ చేసిన సంపత్ (Sampath Nandi) ఈపాటికే స్టార్ డైరెక్టర్ లిస్ట్ లో ఉండాల్సింది కానీ ఎందుకో కెరీర్ లో వెనకపడ్డాడు.

సాయి తేజ్ సినిమాతో తన రేంజ్ కూడా పెంచుకోవాలని చూస్తున్నాడు సంపత్ నంది. ఈ సినిమాతో పాటుగా సాయి తేజ్ మరో సినిమా కూడా లైన్ లో పెడుతున్నట్టు తెలుస్తుంది. సాయి తేజ్ తో నెక్స్ట్ సినిమా డైరెక్టర్ ఎవరన్నది త్వరలో రివీల్ చేస్తారట.

We’re now on WhatsApp. Click to Join

  Last Updated: 09 Oct 2023, 03:53 PM IST