Site icon HashtagU Telugu

Vaishnav Tej : మెగా హీరో మాస్ అటెంప్ట్.. రిజల్ట్ ఎలా ఉంటుందో..?

Mega Hero Vaishnav Tej Mass Attempt How Was The Result

Mega Hero Vaishnav Tej Mass Attempt How Was The Result

మెగా హీరో వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) లీడ్ రోల్ లో శ్రీకాంత్ రెడ్డి డైరెక్షన్ లో వస్తున్న సినిమా ఆదికేశవ. సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చ్యున్ ఫోన్ సినిమాస్ కలిసి నిర్మించిన ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన శ్రీ లీల హీరోయిన్ గా నటించింది. ఈ నెల 24న రిలీజ్ అవుతున్న సినిమా ట్రైలర్ లేటెస్ట్ గా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూశాక సినిమాతో వైష్ణవ్ తేజ్ మాస్ అటెంప్ట్ చేస్తున్నాడని అనిపిస్తుంది.

ఉప్పెన, కొండపొలం, రంగ రంగ వైభవంగా సినిమాల్లో లవర్ బోయ్ ఇమేజ్ తో కనిపించిన వైష్ణవ్ తేజ్ కెరీర్ లో ఫస్ట్ టైం మాస్ అటెంప్ట్ చేస్తున్నాడు. ట్రైలర్ చూస్తే మాస్ కూడా వైష్ణవ్ తేజ్ కి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యిందని అనిపిస్తుంది. మెగా హీరోలకు మాస్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది. ఉప్పెనతో సూపర్ హిట్ అందుకున్న వైష్ణవ్ తేజ్ తర్వాత రెండు సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు.

అందుకే ఈసారి మాస్ సినిమాతో వస్తున్నాడు. ఆదికేశవ ట్రైలర్ తో సినిమాపై బజ్ పెరిగింది. సితార బ్యానర్ నుంచి వస్తున్న సినిమా కాబట్టి సినిమాపై అంచనాలు ఉన్నాయి. మరి వైష్ణవ్ తేజ్ మాస్ అటెంప్ట్ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

ఈ సినిమాతో శ్రీ లీల కూడా మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తుంది. మరి మెగా ఫ్యాన్స్ మెచ్చేలా ఆదికేశవ మెప్పిస్తాడా లేదా అన్నది మరో 3 రోజుల్లో తెలుస్తుంది.

Also Read : Producers vs Reviewers : సినిమా రివ్యూస్ పై ఇండస్ట్రీ కాల్.. ఎవరిది కరెక్ట్..!

We’re now on WhatsApp : Click to Join