Site icon HashtagU Telugu

Sai Dharam Tej: మంచి మనసు చాటుకున్న హీరో సాయి ధరమ్ తేజ్.. సాయం కావాలంటూ ఫోన్ కాల్ రావడంతో?

Mixcollage 24 Feb 2024 09 13 Am 8019

Mixcollage 24 Feb 2024 09 13 Am 8019

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొందరు హీరోలు కేవలం రీల్ లైఫ్ లో మాత్రమే కాకుండా, రియల్ లైఫ్ లో కూడా ఎంతోమందికి సహాయం చేస్తూ హీరో అనిపించుకుంటున్నారు. ఇప్పటికే టాలీవుడ్ హీరోలైన మహేష్ బాబు, ప్రభాస్ చిరంజీవి, బాలకృష్ణ లాంటి హీరోలు ఎంతోమందికి సహాయం చేసి రియల్ లైఫ్ లో కూడా హీరో అనిపించుకున్నారు. కేవలం వీరు మాత్రమే కాకుండా ఇంకా ఎంతో మంది హీరోలు వారికి తోచిన సహాయాన్ని చేసి గొప్ప మనసును చాటుకున్నారు. తాజాగా కూడా మరో హీరో చిన్నారులకు సహాయం చేసి తన గొప్ప మనసును చాటుకున్నారు. ఆ హీరో మరెవరో కాదు? హీరో సాయి ధరమ్ తేజ్.

రీసెంట్‌గా సినిమాటోగ్రాఫర్ ఆండ్రూ బాబు పేరుతో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ప్రత్యక్ష్యం అయ్యింది. అందులో ఏముందంటే తనకు తెలిసిన ఒక అనాధాశ్రమం నుంచి ఇద్దరు చిన్నారుల ట్రీట్మెంట్‌కి సాయం కావాలంటూ కాల్ వచ్చిందట. ఈ విషయం గురించి వెంటనే సాయి ధరమ్ తేజ్‌కు ఒక మెసేజ్ పెట్టగానే ఆలోచించకుండా వెంటనే స్పందించి సాయం చేసారట సుప్రీం హీరో. ఇక దాంతో లవ్ యూ తేజ్ అంటూ ఆండ్రూ బాబు ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో కూడా సాయి ధరమ్ తేజ్ ఇలాంటి సహాయాలు చాలా చేశాడు. కాని అవి బయట చెప్పుకోలేదు మెగా హీరో.

విజయవాడలో వృద్ధుల కోసం ప్రత్యేకంగా ఆశ్రమం కట్టించాడు సాయి తేజ్. ఇలా ఆయన చేసిన గుప్త సహాయాలు ఎన్నో. తాజాగా ఈ చిన్నారుల ప్రాణాలు కాపాడి మరోసారి మంచి మనసు చాటుకున్నాడు. ఇక సాయి ధరమ్ చేసిన సాయానికి కృతజ్ఞతగా ఆ ఆర్ఫనేజ్ పిల్లలు ధన్యవాదాలు చెబుతూ ఒక వీడియోను పంపారు. ఆ వీడియోను ఆండ్రూ బాబు తన ట్వీట్‌కి యాడ్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాయి ధరంతేజ్ మంచి పని చేయడంతో అభిమానులు కామెంట్లు వర్షం కురిపిస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు.