రామ్ చరణ్ నయా రోల్ లవ్లీ అంటున్న ఫ్యాన్స్..

ఈమధ్య బుల్లి తెరమీద రామ్ చరణ్ సందడి చేస్తున్నాడు. యాడ్స్ లో ఎప్పుడూ కనిపించని చరణ్.. సువర్ణభూమి ఇన్ ఫ్రా స్ట్రక్చర్ యాడ్ లో డీసెంట్ లుక్ లో అదరగొడుతున్నాడు. దీనికి తోడు డిస్నీ హాట్ స్టార్ కు బ్రాండ్ అంబాసిడర్ గా హుషారుగా ఆడుతూపాడుతూ అట్రాక్ట్ చేస్తున్నాడు.

  • Written By:
  • Publish Date - September 28, 2021 / 04:13 PM IST

ఈమధ్య బుల్లి తెరమీద రామ్ చరణ్ సందడి చేస్తున్నాడు. యాడ్స్ లో ఎప్పుడూ కనిపించని చరణ్.. సువర్ణభూమి ఇన్ ఫ్రా స్ట్రక్చర్ యాడ్ లో డీసెంట్ లుక్ లో అదరగొడుతున్నాడు. దీనికి తోడు డిస్నీ హాట్ స్టార్ కు బ్రాండ్ అంబాసిడర్ గా హుషారుగా ఆడుతూపాడుతూ అట్రాక్ట్ చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ కోసం భారీగానే రెమ్యునరేషన్ తీసుకున్నాడట చరణ్. 5నుంచి 7 రూపాయలు ఇచ్చినట్లు సమాచారం. రెండుతెలుగు రాష్రాలలో ఇటువంటి ఒక డీల్ చాలా పెద్దది.. ఇంకా ఇదే మొదటిది అనే చెప్పొచ్చు. అందులోనూ పెద్ద ఓటీటీ ప్లాట్ ఫామ్.. ఒక పెద్ద సూపర్ స్టార్ తో కలిసి ఇలా చేయడం మొదటిసారి. అందుకే ఈ రెమ్యునరేషన్ ఇద్దరి రేంజ్ కు తగ్గట్లే ఉందని చరణ్ ఫ్యాన్స్ ఫిధా అయిపోతున్నారు. మామూలుగా ఇలాంటివాటికి దూరంగా ఉండే ఈ అమ్మకొడుకు..తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి చేయడం నిజంగా మెచ్చుకోతగ్గ విషయమేనంటున్నారు. మరోవైపు డిస్నీ హాట్ స్టార్ తమ ప్రమోషన్ కోసం బాలీవుడ్ సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్ ను అప్రోచ్ అయ్యారట. ఇంకో పక్క శంకర్ తో చరణ్ చేస్తున్న మొదటి సినిమా త్వరలోనే రాబోతుంది. ఈ మూవీ మల్టీ లాంగ్వేజ్ లో రిలీజ్ అవబోతుంది. దీనికోసం ప్రస్తుతానికి చరణ్ బిజీబిజీగా ఉంటున్నాడు. మరోవైపు RRR షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటోంది. ఈ మూవీ ఇప్పటికే కోవిడ్ వల్ల చాలా ఆటంకాలు ఫేస్ చేసి అక్టోబర్ లో రిలీజ్ అవనుందని చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. జూనియర్ ఎన్టీ ఆర్, అజయ్ దేవగన్, అలియాభట్ ఈ మూవీలో నటిస్తున్నారు. RRR మూవీ మెగా అభిమానులతో పాటు ఎన్టీఆర్ అభిమానులకు నిజమైన పండగే అని చెప్పొచ్చు. ఇక ఆచార్యలో మెగాస్టార్ చిరంజీవితో మరోసారి నటిస్తున్నారు చరణ్. ఈ మూవీలోని చరణ్ ది ఒక షాట్ పూర్తయింది. ఈ మూవీలో ఒక కీలక పాత్ర పోషించడంతో పాటు ప్రొడ్యూసర్ గా కూడా రామ్ చరణ్ ఉన్నాడు. దీంతో మెగా అభిమానులు మరోసారి తమ హీరోలను ఒకే ఫ్రేములో చూడొచ్చని ఎదురుచూస్తున్నారు.