Vaishnav Tej: వెయిటింగ్ మోడ్ లో మెగా హీరో, ఎందుకో తెలుసా!

వరుసగా ఫెయిల్యూర్స్ పలుకరించడంతో ఈ యువ నటుడు మరో చిత్రానికి సంతకం చేయలేదు.

Published By: HashtagU Telugu Desk
Vaishnav Tej Aadikeshava Review

Vaishnav Tej Aadikeshava Review

Vaishnav Tej: మెగా హీరో వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాతో భారీ హిట్ ను అందుకున్నాడు. అతని తొలి చిత్రం ఉప్పెన బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నాడు. అయితే అప్పటి నుండి వైష్ణవ్ తన కెరీర్‌లో సరైన హిట్ సాధించలేకపోయాడు. అతని గత మూడు చిత్రాలు, కొండపొలం, రంగ రంగ వైభవంగా, ఇప్పుడు ఆదికేశవ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా నిరాశపర్చాయి.

వరుసగా ఫెయిల్యూర్స్ పలుకరించడంతో ఈ యువ నటుడు మరో చిత్రానికి సంతకం చేయలేదు. వెయిటింగ్ గేమ్ ఆడుతున్నాడు. ప్రస్తుతం సినిమాల విషయంలో తొందర పడటం లేదు. విచారకరమైన విషయం ఏమిటంటే.. అతని చేతిలో కూడా పెద్దగా ఆఫర్లు లేవు. వైష్ణవ్ తేజ్ మంచి నటుడు అని, తాను నటించిన సినిమాల్లో ఆ విషయాన్ని నిరూపించుకున్నాడు.

కానీ కొన్ని కారణాల వల్ల, అతను సరైన స్క్రిప్ట్‌లను ఎంచుకోవడం లేదు. దీనికి ఉత్తమ ఉదాహరణ ఆదికేశవ. ఈ సినిమాకి సరైన స్క్రిప్ట్ లేదు. గతంలో చేసిన సినిమాలు కూడ రొటీన్ గా ఉన్నాయి. ఒక నటుడికి ఈ హిట్‌లు మరియు ఫ్లాప్‌లు సర్వసాధారణం కానీ అలాంటి నేపథ్యం ఉన్న తేజ్‌కు నటుడిగా పుష్‌నిచ్చే చిత్రాలను సెలక్ట్ చేసుకోవాలి. మరి ఇప్పుడు వైష్ణవ్ ఎలాంటి మూవీతో మన ముందుకు వస్తాడో వేచి చూడాల్సిందే.

Also Read: Shah Rukh Khan: ‘డుంకీ’ మూవీ హిట్ కొట్టడం పక్కా: షారుక్ ఖాన్

  Last Updated: 02 Dec 2023, 05:44 PM IST