Site icon HashtagU Telugu

Mega Hero: వారెవ్వా వరుణ్, స్టన్నింగ్ లుక్ లో మెస్మరైజ్ చేస్తున్న మెగా హీరో!

Varun

Varun

హీరో వరుణ్ తేజ్ మిషన్ వాలెంటైన్ చిత్రంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 8న విడుదల కానుంది. వరుణ్ తేజ్ తన మొదటి పాన్ ఇండియా చిత్రం మట్కాలో నటిస్తున్నాడు. కరుణ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని వైరా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. తన పాత్ర కోసం వరుణ్ పూర్తిగా సిద్ధమవుతున్నాడు.

వరుణ్ తేజ్ కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా రూపుదిద్దుకోబోతోంది. ఈ చిత్రం పీరియడ్ బ్యాక్‌డ్రాప్‌ ఆధారంగా తెరకెక్కబోతోంది. ఇందులో మెగా హీరో 4 విభిన్న గెటప్‌లలో కనిపిస్తాడు. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ కండలు తిరిగిన ఫిజిక్‌ని నిర్మిస్తున్నాడు. హల్క్ మాదిరిగా బాడీని తీర్చిదిద్దాడు. కండలుదీరిన దేహంతో జిమ్ లో కష్టపడుతున్న ఫొటో మెగా అభిమానులను ఆకట్టుకుంటుంది. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహీ హీరోయిన్లుగా నటిస్తున్న మట్కా చిత్రం త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ప్రస్తుతం వరుణ్ పిక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

గని, గాండీవధారి అర్జున ప్లాప్‌లతో ఆ సినిమాలు చేసిన నిర్మాతలు తీవ్రంగా నష్టపోయారు.  ఈ సినిమా వాల్యూ బిజినెస్ 17 కోట్లు ఉండగా, 18 కోట్ల రూపాయలు బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా పెట్టుకున్నారు. అయితే ఈ సినిమా తొలిరోజే ఆశించిన కలెక్షన్లు వసూలు రాబట్టలేక నిరాశ పరిచింది. ప్రపంచ వ్యాప్తంగా రెండున్నర కోట్ల రూపాయల గ్రాస్ మాత్రమే వసూలైందని చెబుతున్నారు. ఇక గని సినిమా కూడా వరుణ్ కెరీర్‌లోనే అతిపెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఈ విషయాన్ని స్వయంగా వరుణ్‌తేజే అంగీకరించారు. దీంతో ఈ రెండు చిత్రాల నిర్మాతల కోసం వరుణ్ మరో రెండు చిత్రాలు చేయాలని అనుకుంటున్నట్లు టాలీవుడ్ టాక్.

Also Read: CM KCR: ఎన్నికలే లక్ష్యంగా కేసీఆర్ దూకుడు, వీవోఏలకూ వరాలు