Mega Fans కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా నటించిన రాయన్ (Rayan) సినిమా లాస్ట్ ఫ్రై డే రిలీజై సక్సెస్ ఫుల్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాను ధనుష్ సొంత డైరెక్షన్ లో తెరకెక్కించాడు. హీరోగానే కాదు డైరెక్టర్ గా కూడా తన మార్క్ చూపిస్తున్నారు ధనుష్. ఐతే ఈ సినిమా కథ రొటీన్ గా అనిపించినా స్క్రీన్ ప్లే, మ్యూజిక్ సినిమాను నిలబెట్టాయి. ముఖ్యంగా ఏ.ఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్ ఇంప్రెస్ చేసింది.
ఇంటర్వల్ ఇంకా క్లైమాక్స్ లో బిజిఎం తో అదరగొట్టేశాడు. ఈమధ్య కాలంలో రెహమాన్ వర్క్ గురించి అంత గొప్పగా చెప్పుకుంది లేదు కానీ రాయన్ తో మరోసారి ఆయన సత్తా చాటాడు. రెహమాన్ సంగీతం కూడా యాడ్ అవ్వడంతో రాయన్ సినిమాకు మంచి సక్సెస్ దక్కింది. ఐతే ఇదే క్రమంలో రాయన్ సక్సెస్ ని అసలేమాత్రం సినిమాతో సంబంధం లేని మెగా ఫ్యాన్స్ కూడా పండగ చేసుకుంటున్నారు.
అలా ఎందుకు అంటే రాయన్ సినిమా కు రెహమాన్ (A R Rahaman) మ్యూజిక్ అందిస్తుండగా గ్లోబల్ స్టార్ రాం చరణ్ నెక్స్ట్ సినిమాకు రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. రెహమాన్ రాయన్ తో తిరిగి ఫాం లోకి రావడంతో మెగా సినిమాకు కూడా మంచి మ్యూజిక్ ఇస్తాడని నమ్ముతున్నారు. బుచ్చి బాబు డైరెక్షన్ లో చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ఆర్సీ 16వ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు రెహమాన్ ఇప్పటికే రెండు సాంగ్స్ కంపోజ్ చేసినట్టు తెలుస్తుంది.
గ్లోబల్ వైడ్ గా ఉన్న ఆడియన్స్ అందరికీ కనెక్ట్ అయ్యేలా చరణ్ బుచ్చి బాబు సినిమా వస్తుంది. ఈ సినిమాకు రెహమాన్ మ్యూజిక్ కూడా నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తెస్తుందని అంటున్నారు. ఉప్పెన సినిమాలో దేవి నుంచి మంచి సాంగ్స్ రాబట్టిన బుచ్చి బాబు ఈసారి రెహమాన్ తో ఎలాంటి సాంగ్స్ రప్పిస్తాడన్నది చూడాలి.
Also Read : Siddhu : మిస్టర్ బచ్చన్ లో సిద్ధు మాస్ రచ్చ..!