Site icon HashtagU Telugu

Allu Arjun Pushpa 2 : పుష్ప 2 కి మెగా ఫ్యాన్స్ షాక్ తప్పదా..?

Mega Fans ready to give shock to Allu Arjun Pushpa 2

Mega Fans ready to give shock to Allu Arjun Pushpa 2

Allu Arjun Pushpa 2 ఏపీ ఎలక్షన్స్ వల్ల మెగా అల్లు కాంపౌండ్ లో కొత్త సమస్యలు వచ్చేలా చేసింది. అల్లు అర్జున్ చేసిన పని వల్ల మెగా పవర్ ఫ్యాన్స్ అంతా గుర్రుగా ఉన్నారు. మెగా ఫ్యాన్స్ అంతా కూడా యునానిమస్ గా జనసేనకు తమ సపోర్ట్ అందించగా అల్లు అర్జున్ పవన్ కి సపోర్ట్ గా ఒక ట్వీట్ చేసి తన ఫ్రెండ్ శిల్ప రవిచంద్రా రెడ్డి కోసం నంద్యాల వెల్లి సపోర్ట్ అందించాడు. అప్పటినుంచే అల్లు అర్జున్ మీద మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

అల్లు అర్జున్ తర్వాత మళ్లీ దాన్ని సరిచేయాలని ప్రయత్నించినా కుదరలేదు. ఇక మెగా బ్రదర్ నాగ బాబు మనవాడు, పరాయివాడు ట్వీట్ వేయడం ఆ తర్వాత మళ్లీ దాన్ని డిలీట్ చేయడం తెలిసిందే. ఆ ట్వీట్ తో మెగా అల్లు ఫ్యామిలీల మధ్య ఏదో తేడా జరుగుతుందని భావించారు. లేటెస్ట్ గా మెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ అల్లు అర్జున్ ని సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంస్ ఇన్ స్టాగ్రాం, ట్విట్టర్ ల నుంచి అన్ ఫాలో చేశాడు.

ఈ పరిణామాలన్నీ కూడా అల్లు అర్జున్ ని మెగా ఫ్యామిలీ దూరం పెడుతుందనే సంకేతాలు ఇస్తున్నాయి. ఐతే అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ఆగష్టు 15న రిలీజ్ లాక్ చేశారు. అల్లు అర్జున్ చేసిన పనికి టార్గెట్ గా మెగా ఫ్యాన్స్ అంతా కూడా పుష్ప 2 ని బాయ్ కాట్ చేయాలని అనుకుంటున్నారు. అదే జరిగితే మాత్రం పుష్ప 2 కి తీవ్రమైన నష్టం జరిగే అవకాశం ఉంటుంది.

మరి బయట ఇంత జరుగుతున్నా అల్లు అరవింద్ సైలెంట్ గా ఎందుకు ఉన్నాడు. అల్లు అర్జున్ ని కవర్ చేసే క్రమంలో మెగా ప్రొడ్యూసర్ నెక్స్ట్ స్టెప్ ఏంటన్నది తెలియాల్సి ఉంది. అల్లు అర్జున్ సొంత ఇమేజ్ బాగున్నా మెగా ఫ్యాన్స్ అందడండలు మాత్రం కచ్చితంగా కావాల్సిందే. మరి పుష్ప 2 పై మెగా ఫ్యాన్స్ ప్రభావం ఎంత ఉంటుంది అన్నది చూడాలి.