Mega Fans దళపతి విజయ్ స్టార్ డం ఏ రేంజ్ లో ఉంటుందో అందరికీ తెలిసిందే. కోలీవుడ్ లో వరుస హిట్లతో దూసుకెళ్తున్న విజయ్ తన మార్క్ సినిమాలను అందిస్తూ ఫ్యాన్స్ ని అలరిస్తూ వస్తున్నాడు. ఐతే ఆయన ఎంత పెద్ద స్టార్ హీరోనో ఆయన సినిమాలు కూడా అదే రేంజ్ లో వార్తల్లో నిలుస్తుంటాయి. ఏదో ఒక రూపంలో విజయ్ టార్గెట్ అవుతుంటాడు. ఐతే లేటెస్ట్ గా తనకు ఏమాత్రం సంబంధం లేని మ్యాటర్ లో కూడా దళపతి విజయ్ ని ఆడేసుకుంటున్నారు.
ఇంతకీ అసలు విషయం ఏంటి అంటే దళపతి విజయ్ మీద అభిమానంతో హీరోయిన్ కీర్తి సురేష్ చిరంజీవి, విజయ్ (Vijay) లలో బెస్ట్ డాన్సర్ ఎవరని ఒక ఇంటర్వ్యూలో అడిగితే ఆమె విజయ్ పేరు చెప్పింది. ఐతే అదే మెగా ఫ్యాన్స్ కి చిర్రెత్తుకొచ్చేలా చేసింది. తెలుగు సినిమాలను రీమేక్ చేస్తూ విజయ్ స్టార్ డం తెచ్చుకున్నాడని అసలే తెలుగు ఆడియన్స్ అతని మీద విపరీతమైన ట్రోల్స్ చేస్తుంటారు.
Also Read : Raviteja : 10 రోజుల్లో రిలీజ్.. ఇంకా షూటింగ్ ఏంటి రాజా..?
దళపతి విజయ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెలుగు ఫ్యాన్స్ చేసే రచ్చని అడ్డుకోవడానికి నానా తిప్పలు పడతారు. ఇప్పుడు ఏకంగా విజయ్ చిరంజీవి (Chiranjeevi) కన్నా బెస్ట్ డాన్సర్ అనే సరికి ఆ మాట అన్న కీర్తి సురేష్ తో పాటుగా విజయ్ ని కూడా ఎటాక్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. అతని సినిమాలో స్టెప్పులతో సోషల్ మీడియా అంతా హంగామా చేస్తున్నారు.
విజయ్ మీద అభిమానంతో కీర్తి సురేష్ చేసిన కామెంట్స్ వల్ల విజయ్ మీద మెగా ఫ్యాన్స్ ఎటాక్ చేస్తున్నారు. మరి ఇది అనుకోకుండా జరిగినా మెగా ఫ్యాన్స్ వర్సెస్ దళపతి ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో ఫైట్ జరుగుతుంది.