Site icon HashtagU Telugu

Chiru 157 : చిరంజీవికి విలన్ గా మెగా ఫ్యాన్..నిజమా..?

Karthikeya Chiru

Karthikeya Chiru

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిరు 157 కు సంబంధించి ఆసక్తికర వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఇటీవలే పూజా కార్యక్రమాలతో లాంచ్ అయిన మెగా 157 ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. ఈ మూవీలో విలన్ పాత్రకు సంబంధించి అనేక పేర్లు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. తాజా లీకుల ప్రకారం ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ(karthikeya)ను ప్రతినాయకుడిగా తీసుకునే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో అజిత్ ‘వలిమై’ మరియు నాని ‘గ్యాంగ్ లీడర్’ చిత్రాల్లో విలన్‌గా నటించిన కార్తికేయ, నటన పరంగా మంచి పేరు తెచ్చుకున్నా, కమర్షియల్ గా మాత్రం పెద్ద హిట్లు అందుకోలేకపోయారు. అయితే చిరంజీవి అంటే తనకు విపరీతమైన అభిమానమున్న కార్తికేయ, ఆయన సినిమాలో ఛాన్స్ వస్తే క్షణం కూడా ఆలోచించకుండా ఓకే చెబుతాడని నిత్యం చెపుతుంటాడు.

Maoists : వరంగల్‎లో భారీగా మావోయిస్టులు లొంగుబాటు

ఈ క్రమంలో అనిల్ రావిపూడి సినిమాలో విలన్ గా ఛాన్స్ వచ్చినట్లు ప్రచారం నడుస్తుంది. అనిల్ రావిపూడి స్టైల్‌లోని విలన్లు కొంత కామెడీ కలిగి ఉంటారు. ఈ తరహా పాత్రలు కార్తికేయకు సూటవుతాయన్న అభిప్రాయం ఉంది. అజిత్‌తో నటించడం ఒక డ్రీమ్ అయితే, చిరు పక్కన కనిపించడం జీవిత లక్ష్యమే అని చెప్పే కార్తికేయకు ఇది గోల్డెన్ ఛాన్స్ కావొచ్చు. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర ప్రమోషన్స్‌కి సన్నద్ధమవుతున్న నేపథ్యంలో, వాటికి అవసరమైన డేట్స్ మినహాయించి అనిల్ రావిపూడికి మెగా స్టార్ రెండు నెలల కాల్షీట్స్ ఇవ్వనున్నట్టు సమాచారం. హీరోయిన్ ఎంపిక సహా ఇతర కీలక వివరాలు ఇంకా అధికారికంగా వెలువడలేదు. ఈ భారీ ఎంటర్‌టైనర్‌ను 2026 సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.