Mega Vs Allu : అల్లు ఫ్యామిలీ ని మెగా ఫ్యామిలీ దూరం పెడుతుందా..?

మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కల్యాణ్‌కు అండగా నిలిస్తే..ఒక్క అల్లు అర్జున్ మాత్రం వైసీపీ అభ్యర్థికి తన మద్దతు ప్రకటించారు

Published By: HashtagU Telugu Desk
Allu Vs Mega

Allu Vs Mega

మెగా వర్సెస్ అల్లు అభిమానుల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుంది. గత కొద్దీ రోజులుగా వీరి మధ్య వార్ నడుస్తున్నప్పటికీ.. ఏపీ ఎన్నికలు వీరి మధ్య మరింత అగ్గి రాజేశాయి. ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి ఇంటికి వెళ్లడం మెగా అభిమానుల్లో ఆగ్రహం నింపింది. పదేళ్లుగా సొంత మనిషి కష్టపడుతుంటే..అనరాని మాటలు వైసీపీ అంటుంటే ..అవన్నీ మరచి వైసీపీ అభ్యర్ధికి మద్దతు ఇవ్వడం ఏమాత్రం తట్టుకోలేకపోయారు. మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కల్యాణ్‌కు అండగా నిలిస్తే..ఒక్క అల్లు అర్జున్ మాత్రం వైసీపీ అభ్యర్థికి తన మద్దతు ప్రకటించారు. దీని తర్వాత అల్లు అర్జున్ ఉద్దేశించి మెగా బ్రదర్ నాగబాబు ట్విట్టర్ వేదికగా విమర్శలు చేయడం, దానికి బన్ని అభిమానులు ఓ రేంజ్‌లో ఫైర్ అవ్వడం వెంటవెంటనే జరిగిపోయాయి. అల్లు అర్జున్ అభిమానుల తాకిడికి నాగబాబు ట్విట్టర్ అకౌంట్‌ను కూడా డిలీట్ చేశారు. ఇక ఈ ఎన్నికల్లో కూటమి విజయం సాధించడం..అల్లు అర్జున్ మద్దతు ప్రకటించిన శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి ఓడిపోవడంతో మెగా అభిమానులు అల్లు అర్జున్ ను మరింతగా టార్గెట్ గా చేస్తూ వస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక పిఠాపురం బరిలో పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత కూడా అల్లు అర్జున్ జస్ట్ ఓ ట్వీట్‌తో సరిపెట్టాడు తప్పించి.. వ్యక్తిగతంగా కలవడం గానీ, ఆఖరికి చిరంజీవి ఇంట్లో జరిగిన సంబరాల్లోనూ అల్లు ఫ్యామిలీ కనిపించలేదు. ఒకవేళ బన్నీ ఏమైనా షూటింగ్ లో బిజీ గా ఉన్నాడేమో అనుకున్న అల్లు అరవింద్ కానీ , అల్లు శిరీష్ , స్నేహ ఇలా ఎవ్వరు కూడా పాల్గొనలేదు. పోనీ పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తుంటే.. మెగా ఫ్యామిలీలోని చిన్నా, పెద్ద బెజవాడలో ఒక రోజు ముందే ల్యాండ్ అయ్యారు. వారిలో అల్లు కుటుంబ సభ్యులు కనిపించలేదు. కనీసం పవన్‌కు ఆల్ ది బెస్ట్ చెబుతూ బన్నీ చిన్న ట్వీట్ కూడా చేయకపోవడం చర్చనీయాంశమైంది. ఇలా ఇవ్వని చూస్తూ వచ్చిన మెగా మేనల్లుడు సాయిథరం తేజ్ .. అల్లు అర్జున్‌తో పాటు ఆయన సతీమణి స్నేహారెడ్డిని సోషల్ మీడియాలో ఆన్‌ ఫాలో చేసాడు. ఇలా వరుస పరిణామాలు మెగా – అల్లు ఫ్యామిలీల మధ్య దూరాన్ని మరింత పెంచేలా కనిపిస్తున్నాయి. మరి ఫైనల్ గా ఎవరు తగ్గుతారో..చూడాలి.

Read Also : Chandrababu Oath Ceremony : పవన్ మొత్తం తనవైపు తిప్పుకున్నాడుగా..!!

  Last Updated: 12 Jun 2024, 08:44 PM IST