Site icon HashtagU Telugu

Mega Pic : సంక్రాంతి మెగా పిక్ లో ‘తమ్ముడు’ మిస్

Megapic

Megapic

 

సంక్రాంతి పండగను తెలుగువారు ఎంతో ఘనంగా జరుపుకుంటారనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఏపీ వాసులు ఎంతో ఘనంగా జరుపుకుంటుంటారు. సంక్రాంతి కి వారం ముందు నుండే సంబరాలు మొదలుపెడతారు. సినీ తారలు సైతం ఆంధ్రకు వెళ్లి సొంతర్లలో సంక్రాంతి వేడుకను జరుపుకుంటారు. ఈ క్రమంలో మెగా ఫ్యామిలీ సభ్యులంతా ఒకేచోట చేరి..సంక్రాంతిని ఎంతో సంతోషంగా జరుపుకున్నారు. దీని తాలూకా పిక్ ను మెగా స్టార్ చిరంజీవి అభిమానులతో పంచుకొని , వారిలో సంతోషం నింపారు.

ఆదివారం ఉదయమే బెంగ‌ళూరులోని ఫాంహౌస్‌కు చేరుకున్న మెగా ఫ్యామిలీ.. ఉదయం నుంచి స్వయంగా టిఫిన్స్, స్నాక్స్, పిండివంటలు చేసుకుంటూ ఎంతో ఆనందంగా సంక్రాంతిని జరుపుకున్నారు. ఈ మేరకు ‘పాడి పంటల,భోగ భాగ్యాల ఈ సంక్రాంతి.. ప్రతి ఇంటా ఆనందాల పంటలు పండించాలని ఆశిస్తూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు’ తెలిపారు చిరంజీవి. ఇక ఈ యేడాది చిరు ఫ్యామిలీలోకి మ‌నుమ‌రాలు క్లింకార రావడం, వ‌రుణ్ తేజ్ లావ‌ణ్యల పెళ్లి ప్రత్యేకంగా నిలిచాయి. సురేఖ దోశలు వేయడం, రామ్ చరణ్ సహకరించడం వంటి సరదా సన్నివేశాల ఫొటోలు మెగా అభిమానులను అలరిస్తున్నాయి. అయితే ఈ మెగా పిక్ లో తమ్ముడు పవన్ కళ్యాణ్ ఒక్కరే మిస్ అవ్వడం అభిమానులను కాస్త నిరాశ కుగురి చేసింది.

పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం రాజకీయాలతో ఎంత బిజీ గా గడుపుతున్నాడో చెప్పాల్సిన పనిలేదు. కుటుంబాన్ని, పండగలను, పిల్లలను సైతంమర్చిపోయి ప్రజల కోసం పోరాడుతున్నాడు. ఏడాదికి ఒక సినిమా చేస్తూ కోట్లు వెనకేసుకోవచ్చు. కానీ, పవన్ కోట్లను వద్దని కోట్లాదిమంది ప్రజల సమస్యలు తీర్చడమే లక్ష్యంగా పెట్టుకొని పోరాటం చేస్తున్నారు. అపజయాలు వచ్చినా పట్టించుకోకుండా.. ఎవరు ఎన్ని విమర్శలు , మాటలు అన్న కానీ వాటిని లెక్కచేయకుండా విజయం కోసం ముందుకు వెళ్తున్నాడు. ఈరోజు సంక్రాంతి సందర్బంగా కుటుంబమంతా సంక్రాంతి సంబురాల్లో మునిగితేలుతుంటే.. పవన్ మాత్రం ఏపీ ఎలక్షన్స్ ప్రచార కార్యకలాపాల్లో నిమగ్నమయ్యాడు.

Read Also :  Kite Man : ఒకే దారానికి 1000 పతంగులు.. కైట్ మ్యాన్ మ్యాజిక్

Exit mobile version