Site icon HashtagU Telugu

Mega Family : మెగా సంక్రాంతి.. మెగా ఫ్యామిలీ అంతా బెంగుళూరులో సందడి..

Mega Family Sankranthi Special Photo goes Viral

Mega Family Sankranthi Special Photo goes Viral

మెగా ఫ్యామిలీ(Mega Family) అంతా ప్రతి పండక్కి అందరూ ఒకేచోట చేరి సెలబ్రేషన్స్ చేసుకుంటారని తెలిసిందే. మెగా, అల్లు ఫ్యామిలీలు అంతా ఒకేచోట చేరతాయి. కజిన్స్ అంతా కలిసి ఎంజాయ్ చేస్తారు. తాజాగా సంక్రాంతి(Sankranthi) పండగకు కూడా మెగా, అల్లు ఫ్యామిలీలు అంతా ఒక్కచోటకే చేరాయి. ఇటీవలే మెగా ఫ్యామిలీ అంతా బెంగుళూరుకు హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ ఉంచి వెళ్లగా విజువల్స్ వైరల్ అయ్యాయి.

బెంగుళూరులోని చిరంజీవి ఫామ్ హౌస్ లో మెగా ఫ్యామిలీ సంక్రాంతి సెలబ్రేషన్స్ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇప్పటికే ఉపాసన, లావణ్య, వైష్ణవ్ తేజ్.. ఇలా మెగా కజిన్స్ అంతా బెంగుళూరులోని సంక్రాంతి సెలబ్రేషన్స్ ని గత రెండు రోజులుగా వారి ఇన్‌స్టాగ్రామ్ స్టోరిలలో షేర్ చేస్తున్నారు. తాజాగా మెగా హీరోలు, మెగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి ఒక్కటే ఫోటో దిగి ఆ ఫోటోని అందరూ సోషల్ మీడియాల్లో షేర్ చేస్తున్నారు.

ఈ మెగా ఫ్యామిలీ ఫొటోలో చిరు, చరణ్ దంపతులు, చిరంజీవి సిస్టర్స్ ఫ్యామిలీలు, నాగబాబు ఫ్యామిలీ, కొత్త జంట వరుణ్ లావణ్య, అల్లు అరవింద్ ఫ్యామిలీ, అల్లు బ్రదర్స్ ఫ్యామిలీలు, చిరంజీవి కూతుళ్ళ ఫ్యామిలీలు, వారి పిల్లలు, వైష్ణవ్ తేజ్, సాయి తేజ్.. ఇలా అంతా ఉన్నారు. వీరితో పాటు పవన్ కళ్యాణ్ కొడుకు, కూతురు అకిరా నందన్, ఆద్యలు కూడా ఉండటం విశేషం. ఇక ఈ ఫొటోలో అబ్బాయిలంతా వైట్ డ్రెస్సులు వేస్తే, లేడీస్ అంతా రెడ్ డ్రెస్ లు వేయడం గమనార్హం. దీంతో ఈ మెగా సంక్రాంతి ఫోటో వైరల్ గా మారింది. ఈ ఫోటోని మెగా ఫ్యామిలీ అంతా షేర్ చేస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తున్నారు. అయితే ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్ ఒక్కడే లేడని ఆయన అభిమానులు బాధపడుతున్నారు. ఇక ఈ సారి కూడా చరణ్ కూతురు క్లిన్ కారా ఫేస్ కనిపించకుండా జాగ్రత్త పడ్డారు

 

Also Read : Shatamanam Bhavati: సంక్రాంతి బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ వచ్చేస్తోంది