Site icon HashtagU Telugu

Mega Family Counter: మంత్రి కొండా సురేఖ‌కు టాలీవుడ్ సెగ‌.. వ‌రస ట్వీట్ల‌తో విమ‌ర్శ‌లు చేస్తున్న స్టార్స్‌

Chiru1

Chiru1

Mega Family Counter: తెలంగాణలో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్య‌లు హాట్ టాపిక్‌గా మారాయి. స‌మంత‌- నాగ‌చైత‌న్య విడిపోవ‌టానికి కార‌ణం కేటీఆరే అని ఆమె చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు తీవ్ర వివాదాస్ప‌దం అవుతున్నాయి. ఓ వైపు మంత్రి స్వ‌యంగా క్లారిటీ ఇచ్చిన ఈ వివాదంపై సినీ ప్ర‌ముఖుల విమ‌ర్శ‌లు మాత్రం ఆగ‌టంలేదు. తాజాగా ఈ వివాదంపై మెగా ఫ్యామిలీ (Mega Family Counter) త‌మ టోన్ ను వినిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్‌, లావ‌ణ్య త్రిపాఠి స‌మంత‌పై మంత్రి చేసిన వ్యాఖ్య‌ల‌కు కౌంట‌ర్ ఇచ్చారు.

తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ సినీ నటుడు చిరంజీవి తాజాగా స్పందించారు. ఆ అమర్యాదకర వ్యాఖ్యలు చూసి తాను చాలా బాధపడ్డట్లు తెలిపారు. వార్తల్లో నిలిచేందుకు సినీ ప్రముఖులు, సెలబ్రిటీల పేర్లు వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. రాజకీయాలకు ఏ మాత్రం సంబంధం లేని వాళ్లను ఇందులోకి లాగడం.. అసత్య ఆరోపణలు చేయడం సరికాదన్నారు. రాజకీయ నాయకులు ఇతరులకు ఆదర్శంగా ఉండేలా ప్రవర్తించాలని సూచించారు.

Also Read: Hassan Nasrallah : రేపు హిజ్బుల్లా చీఫ్ అంతిమయాత్ర.. ఇజ్రాయెల్ దాడిలో నస్రల్లా అల్లుడి మృతి

మంత్రి వ్యాఖ్య‌ల‌ను ఖండించిన అల్లు అర్జున్‌

మాజీ మంత్రి కేటీఆర్, హీరోయిన్ సమంతపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. తాజాగా మంత్రి సురేఖ వ్యాఖ్యలను స్టార్ హీరో అల్లు అర్జున్ ఖండించారు. ‘సినీ ప్రముఖులు, సినీ కుటుంబాలను అవమానించేలాగా మాట్లాడిన మాటలను నేను ఖండిస్తున్నాను. రాజకీయ పార్టీలు మహిళల పట్ల బాధ్యతగా, మర్యాదగా ప్రవర్తించాలి’ అనే పేర్కొన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.

మెగా కోడ‌లు కౌంట‌ర్‌

ఇప్పటికే గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్న కుటుంబం గురించి ఇలాంటి అసహ్యకరమైన మాటలు చెప్పడం పూర్తిగా తప్పు. ఒక స్త్రీ మరొక స్త్రీ గురించి ఎంత భయంకరంగా మాట్లాడగలదో నిజంగా సిగ్గుచేటు. ఎందుకు నటులు, వారి కుటుంబాలను ఎల్ల‌ప్పుడూ ల‌క్ష్యంగా చేసుకుంటున్నారు..? అంటూ మెగా కోడ‌లు, వ‌రుణ్ తేజ్ భార్య లావ‌ణ త్రిపాఠి కౌంట‌ర్ ఇచ్చారు.

మంత్రి వ్యాఖ్యలు దురదృష్టకరం: వెంకటేష్

సమంత, నాగచైతన్య, నాగార్జున పేర్లను ప్రస్తావిస్తూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై నటుడు వెంకటేష్ స్పందించారు. ‘‘ఇతరుల వ్యక్తిగత పరిస్థితిని రాజకీయాల కోసం వాడటం నన్నెంతో బాధించింది. బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి.. రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. మీ చర్యలు, మాటలు స్ఫూర్తి నింపేలా ఉండాలని కోరుకుంటున్నా’’ అని ఆయన పేర్కొన్నారు.