Site icon HashtagU Telugu

Ram Charan: రామ్ చరణ్ పోస్ట్ పై ఫన్నీ మీమ్స్ చేసిన ఫ్యాన్స్.. పోస్ట్ వైరల్?

Mixcollage 23 Feb 2024 08 54 Am 6443

Mixcollage 23 Feb 2024 08 54 Am 6443

టాలీవుడ్ హీరో రామ్ చరణ్ గురించి మనందరికీ తెలిసిందే. రామ్ చరణ్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు. కాగా రామ్ చరణ్ చివరగా ఆర్ఆర్ఆర్ మూవీతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. అయితే చెర్రీ నుంచి సినిమా వచ్చి రెండేళ్లు అయ్యిపోతుంది. ఆర్ఆర్ఆర్ తరువాత ఆచార్యలో ఒక ముఖ్య పాత్రలో కనిపించిన రామ్ చరణ్ గత మూడేళ్ళుగా గేమ్ ఛేంజర్ షూటింగ్‌ని జరుపుకుంటూనే వస్తున్నారు. ఇప్పటికి కూడా ఈ మూవీ రిలీజ్‌పై ఒక క్లారిటీ లేదు. అసలు షూటింగ్ ఎంత అయ్యింది అనేది కూడా సమాచారం లేదు.

చరణ్ ఈ సినిమా అప్డేట్స్ తప్ప అన్ని ఇస్తూ వస్తున్నారు. తన సినిమా అప్డేట్‌ని పక్కన పెట్టి ఇతర హీరోల సినిమాల అప్డేట్స్ ని తెలియజేస్తూ వస్తున్న రామ్ చరణ్‌ని చూసి అభిమానులు తెగ బాధ పడిపోతున్నారు. ఇక రీసెంట్‌గా ఉపాసన తన అత్త సురేఖతో కలిసి అత్తమ్మ కిచెన్స్ అంటూ కొత్త వ్యాపారం స్టార్ట్ చేశారు.

 

ఇక దీనిపై రామ్ చరణ్ రియాక్ట్ అవుతూ.. ఇన్‌స్టా స్టోరీ పెట్టడం, ఉపాసన పెట్టిన పోస్టు కింద కామెంట్ పెట్టారు. ఉపాసన పోస్టుకి చరణ్.. టేస్ట్ అదిరింది మీరు ట్రై చేయండి అంటూ కామెంట్ చేశారు. ఈ కామెంట్ చూసిన మెగా అభిమానులు.. ఎసువంటి ఎసువంటి బాక్స్ ఆఫీస్ రికార్డులు షేక్ చేసే వాడివి అన్న.

 

ఇప్పుడు టేస్ట్ బాగుంది అంటూ రివ్యూలు ఇస్తున్నావు. రామ్ చరణ్ ఫ్యాన్‌గా ఉండడం అంత ఈజీ పని కాదు అంటూ ఫన్నీ మీమ్ వీడియోలు క్రియేట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరి ఆ మీమ్స్ చూసి మీరు కూడా ఫుల్ గా ఎంజాయ్ చేయండి.