Site icon HashtagU Telugu

Ram Charan-Upasana: మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేస్తున్న రామ్ చరణ్, ఉపాసన.. ఫొటోలు ఇదిగో!

Ram Charan

Ram Charan

టాలీవుడ్ మోస్ట్ కపుల్ రామ్ చరణ్, ఉపాసన (Ram Charan & Upasana) త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మెగా హీరో సినిమాలకు ఎంత ప్రాధాన్యం ఇస్తే.. ఫ్యామిలీకి అంతకంటే ప్రాధాన్యత ఇస్తారు. ఏమాత్రం సమయం దొరికినా కుటుంబ సభ్యులతో గడిపేందుకు ఇష్టపడుతాడు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ తన భార్యతో మాల్దీవ్స్ టూరుకు వెళ్లాడు. అక్కడ తన భార్యతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. మండు వేసవిలో అలలపై దూసుకుపోతూ నేచర్ ను అస్వాదిస్తున్నారు. చరణ్ తన టూర్ కు సంబంధించిన ఫొటోలను వైరల్ చేయగా.. సోషల్ మీడియాలో నిమిషాల్లో వైరల్ (Viral) అయ్యాయి.

గత శనివారం హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో కనిపించారు. చరణ్, ఉపాసన సౌకర్యవంతమైన దుస్తుల్లో మల్దీవ్స్ కు బయలుదేరారు (Ram Charan & Upasana). ఇప్పటికే దుబాయ్ లో బేబీ షవర్ వేడులకు సెలబ్రేట్ చేసుకున్న ఈ జంట ఈ విహారయాత్రలో బిజీ బిజీగా ఉన్నారు. దుబాయ్‌లో తమ సన్నిహితులతో బేబీ షవర్ ఫంక్షన్‌ను జరుపుకున్నారు. ఆ సందర్భంగా ఉపాసన తన బేబీ బంప్‌ను ప్రదర్శించింది. ఆ వేడుకకు కోసం చరణ్, ఉపాసన 1.5 కోట్ల ఖర్చు పెట్టినట్టు తెలుస్తోంది.

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అందమైన జంటలలో చరణ్, ఉపాసన (Ram Charan & Upasana) ఒకటి. ఈ జంట త్వరలో తల్లిదండ్రులు కాబోతుంటంతో మెగా ఇంట ఆనందం నెలకొంది. పెళ్లయిన 10 సంవత్సరాల తర్వాత ఉపాసన గర్భం దాల్చడం మెగా ఫ్యామిలీ ఆనందం నింపుతోంది. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ (Shankar) దర్శకత్వంలో గేమ్ ఛేంజర్‌ సినిమాలో కనిపించబోతున్నాడు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయగా, ప్రేక్షకుల నుండి భారీ స్పందన వచ్చింది. కైరా అద్వానీ ఈ చిత్రంలో కథానాయిక. ఇందులో అంజలి, జయరామ్, సునీల్, శ్రీకాంత్, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Also Read: Radhika Merchant Pics: అంబానీ కోడలు అదుర్స్.. రాధిక మర్చంట్ పిక్స్ వైరల్!