Site icon HashtagU Telugu

Nagababu: చిరంజీవి,పవన్ కళ్యాణ్ లకు నాగబాబు ఎన్ని కోట్లు అప్పు ఉన్నారో తెలిస్తే షాకవ్వాల్సిందే?

Nagababu

Nagababu

మెగా బ్రదర్స్ నాగబాబు, పవన్ కళ్యాణ్, చిరంజీవిల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ముగ్గురు హీరోలు ఎవరికి వారు ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. కానీ వీరిలో ఎక్కువ ఫాలోయింగ్ మాత్రం పవన్ కళ్యాణ్ కి ఉంది అని చెప్పాలి. అటు రాజకీయపరంగా ఇటు సినిమాల పరంగా పవన్ కళ్యాణ్ కు డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ తర్వాత ఆ రేంజ్ లో అభిమానులను సంపాదించుకున్న హీరో మెగాస్టార్ చిరంజీవి. మొదటి చిరంజీవి ఎంట్రీ ఇచ్చిన తర్వాతనే నాగబాబు పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఇక నాగబాబు నిర్మాతగా హీరోగా, నటుడిగా, రాజకీయ నాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

చాలా సినిమాలకు నిర్మాతగా వ్యవహరించడంతో పాటు హీరో హీరోయిన్లకు తండ్రి క్యారెక్టర్లలో బాబాయి క్యారెక్టర్లలో నటించి మెప్పించారు. ఇది ఇలా ఉంటే సోషల్ మీడియాలో నాగబాబుకు సంబంధించిన ఒక వార్త వైరల్ గా మారింది. అదేమిటంటే..కాగా ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో నాగబాబు తన ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడించారు. 70 కోట్ల రూపాయల ఆస్తులను ప్రకటించిన నాగబాబు తనపై ఎలాంటి క్రిమినల్‌ కేసులూ లేవని స్పష్టం చేశారు. అయితే మెగా ఫ్యామిలీ గురించి ప్రతి చిన్న విషయాన్ని ఆసక్తిగా చర్చించే అభిమానులకు నాగబాబు అఫిడవిట్‌ లో పేర్కొన్న ఆస్తులు, అప్పులు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

దీనిలో చిరంజీవి, పవన్ దగ్గర నాగబాబు అప్పు తీసుకున్నట్టు ప్రకటించడం మరింత ఆసక్తి రేపింది. చరాస్తుల విలువ 59 కోట్లు, నాగబాబు దగ్గర బాండ్లు, మ్యూచువల్ ఫండ్స్, నగదు కలిపి 59 కోట్ల వరకు ఆస్తులు ఉన్నాయట. మ్యూచువల్ ఫండ్స్/బాండ్లు రూ.55.37 కోట్లు, చేతిలో నగదు రూ.21.81 లక్షలు, అలాగే బ్యాంకు నిల్వలు – రూ.23.53 లక్షలు, ఇతరులకు ఇచ్చిన అప్పులు – రూ.1.03 కోట్లు,బెంజ్ కారు రూ.67.28 లక్షలు, అలాగే హ్యుందాయ్ కారు రూ.11.04 లక్షలుగా ఉందట. బంగారం & వెండి, రూ.57.99 లక్షల విలువైన 724 గ్రాముల బంగారం, భార్య వద్ద 55 క్యారట్ల వజ్రాలు రూ.16.50 లక్షలు, 20 కేజీల వెండి రూ.21.40 లక్షలు విలువ ఉంటుందట. హైదరాబాద్ పరిసరాల్లో 11 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయట. నాగబాబుకు హైదరాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో భూములు ఉన్నాయట. ఇకపోతే
మెగా బ్రదర్స్‌కు అప్పులు విషయానికి వస్తే.. అన్న చిరంజీవి, తమ్ముడు పవన్ కల్యాణ్ దగ్గర అప్పులు తీసుకున్నారట. చిరంజీవి దగ్గర రూ.28.48 లక్షలు అప్పు.. పవన్ కల్యాణ్ దగ్గర రూ.6.90 లక్షలు అప్పు తీసుకున్నట్లు నాగబాబు ప్రకటించారు. ఇదే కాకుండా బ్యాంక్ హౌసింగ్ లోన్ రూ.56.97 లక్షలు, కారు రుణం రూ.7.54 లక్షలు ఉన్నట్లు ప్రకటించారు.