Site icon HashtagU Telugu

Niharika Konidela Turns Gangubai: గంగూబాయిగా మారిన నిహారిక.. మెగా ఫ్యాన్స్ కేక!

Niharika

Niharika

టాలీవుడ్ నటి, మెగా కూతురు నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ ముద్దగుమ్మ సినిమాల్లో పెద్ద మెరవకపోయినప్పటికీ, ట్విట్టర్, ఇన్ స్టా, బుల్లితెరపై సందడి చేస్తూ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. అందుకే నిహారికకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తరచుగా జిమ్, టూర్ వీడియోలను పోస్ట్ చేసే నిహారిక, ఈసారి అలియా భట్ గెటప్ వేసుకొని గంగుభాయిలా కనిపించింది.

నిహారిక గంగూబాయి గెటప్‌లో కనిపించింది మెగా ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేసింది.  ఆమె భర్త చైతన్య కూడా వీడియోలో కనిపించాడు. గంగుభాయిలా చీర కట్టుకొని, పాన్ నములుతున్నట్టు అలియాను ఇమిటేట్ చేసి ఆకట్టుకుంది. ఆమె తన పోస్ట్‌కి “ఛానెల్లింగ్ గంగూ… నేను కాస్ట్యూమ్స్ పార్టీలను ప్రేమిస్తున్నాను. దయచేసి చివరి వీడియోలో నా వెనుక ఉన్న కోతులను పట్టించుకోకండి.” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం వీడియో వైరల్ గా మారింది.