Mega Cousins: జిల్‌.. జిల్‌.. జిగా.. ఒకే ఫ్రేమ్ లో ‘మెగా, అల్లు’ ఫ్యామిలీ!

అటు మెగా ఫ్యామిలీ, ఇటు అల్లు ఫ్యామిలీ (Mega Cousins) ఒకే దగ్గర కనిపించి సందడి చేశారు.

Published By: HashtagU Telugu Desk
Mega and allu Family

Mega Family

‘మెగా’ కుటుంబం (Mega Family) నిస్సందేహంగా తెలుగు చిత్ర పరిశ్రమలోని ఉన్నత కుటుంబాలలో ఒకటి. ఈ ఫ్యామిలీ ఇప్పటివరకు 20 మందికి పైగా సినీ నటులు, చిత్రనిర్మాతలను టాలీవుడ్ కు అందించింది. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Megastar chiranjeevi) కొణిదెల కుటుంబంలో ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి. అతని తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా ఇండస్ట్రీలో సూపర్ స్టార్. ప్రస్తుత సూపర్‌స్టార్లుగా రామ్ చరణ్, అల్లు అర్జున్‌ టాలెంటెడ్ యాక్టర్స్ గా రాణిస్తున్నారు.

తెలుగు చిత్ర పరిశ్రమ (Tollywood) లోని అతిపెద్ద కుటుంబానికి చెందిన ప్రస్తుత తరం రీసెంట్ గా హైదరాబాద్‌లో జరిగిన ఫ్యామిలీ ఫంక్షన్‌కు హాజరై సరదాగా కలుసుకున్నారు. క్రిస్మస్ ఫెస్టివల్ సందర్భంగా సందడి చేశారు. కుటుంబమంతా సరాదాగా కబ్లురు చెప్పారు. శాంటాకు సంబంధించిన గేమ్స్ ఆడారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను రామ్ చరణ్ భార్య ఉపాసన కామినేని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ (Viral Pic) అవుతోంది. చిత్రంలో, రామ్ చరణ్, ఉపాసనతో పాటు అల్లు అర్జున్, అతని భార్య అల్లు స్నేహ రెడ్డి, సాయి ధరమ్ తేజ్, నిహారిక కొణిదెల, వరుణ్ తేజ్, అల్లు శిరీష్ పలువురు ఉన్నారు.

చిరంజీవి తనయుడు రామ్ చరణ్ (Ram Charan), అతని మేనల్లుడు అల్లు అర్జున్ తెలుగు చిత్ర పరిశ్రమలో మోస్ట్ సూపర్ స్టార్స్. రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్యాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందాడు. మరోవైపు సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప: ది రైజ్‌తో అల్లు అర్జున్ తన కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌ను అందుకున్నాడు. అల్లు శిరీష్, వరుణ్ తేజ్ కొణిదెల, సాయి ధరమ్ తేజ్ కూడా టాలీవుడ్ పై తమ ముద్ర వేస్తున్నారు. అల్లు అర్జున్ (Allu arjun), స్నేహరెడ్డి దంపతులకు ఇద్దరు సంతానం. అల్లు అర్హ, అయాన్ లు ఇప్పటికే సోషల్ మీడియాలో అలరిస్తున్నారు. అర్హ శాకుంతల మూవీలో నటిస్తోంది కూడా. ఇక మెగా పవర్ స్టార్ రాంచరణ్, ఉపాసన (Upasana) కూడా తాము తల్లిదండ్రులు కాబోతున్నామని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

Also Read: Hanu-man Underwater Sequence: ‘హను-మాన్’ కోసం తేజ సజ్జ అండర్ వాటర్ సీక్వెన్స్

  Last Updated: 21 Dec 2022, 12:56 PM IST