మెగా 158 అప్డేట్ బాబీ తో మళ్ళీ హ్యాట్రిక్ కొట్టబోతున్న చిరంజీవి

Chiru-Bobby Movie మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘మన శంకర వరప్రసాద్‌గారు’ విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇదే ఊపులో ఆయన 158వ సినిమాను దర్శకుడు బాబీ కొల్లితో కలిసి తెరకెక్కించనున్నారు. వచ్చే నెలలో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రం మాస్ యాక్షన్‌తో పాటు బలమైన కూతురు సెంటిమెంట్‌ను ప్రధానంగా చూపించనుందని సమాచారం. తండ్రి–కూతురు మధ్య భావోద్వేగ బంధం, దాని కోసం చేసే పోరాటమే కథకు ప్రాణంగా నిలవనుందట. ఈ ఎమోషనల్ యాంగిల్ మెగాస్టార్‌ను కొత్త షేడ్‌లో చూపించబోతుందన్న […]

Published By: HashtagU Telugu Desk
Chiru Bobby Movie

Chiru Bobby Movie

Chiru-Bobby Movie మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘మన శంకర వరప్రసాద్‌గారు’ విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇదే ఊపులో ఆయన 158వ సినిమాను దర్శకుడు బాబీ కొల్లితో కలిసి తెరకెక్కించనున్నారు. వచ్చే నెలలో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రం మాస్ యాక్షన్‌తో పాటు బలమైన కూతురు సెంటిమెంట్‌ను ప్రధానంగా చూపించనుందని సమాచారం. తండ్రి–కూతురు మధ్య భావోద్వేగ బంధం, దాని కోసం చేసే పోరాటమే కథకు ప్రాణంగా నిలవనుందట. ఈ ఎమోషనల్ యాంగిల్ మెగాస్టార్‌ను కొత్త షేడ్‌లో చూపించబోతుందన్న అంచనాలు అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నాయి.

ఇండస్ట్రీలో ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా తన క్రేజ్ ఏమాత్రం తగ్గనివ్వని అరుదైన హీరో మెగాస్టార్ చిరంజీవి . ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మన శంకర వరప్రసాద్‌గారు’ సినిమా థియేటర్లలో మంచి సందడిని కొనసాగిస్తూ చిరు మార్కెట్‌కు మరోసారి బలమైన బూస్ట్ ఇచ్చింది. వయసుతో సంబంధం లేకుండా కథ, పాత్ర, ప్రెజెన్స్‌తోనే బాక్సాఫీస్‌ను కదిలించే శక్తి తనకే సొంతమని ఆయన మరోసారి నిరూపించారు. ఈ ఊపుతోనే ఇప్పుడు ఆయన 158వ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గతంలో ‘వాల్తేరు వీరయ్య’తో భారీ కమర్షియల్ సక్సెస్ అందించిన దర్శకుడు బాబీ కొల్లితో మళ్లీ కలవడం వల్ల ఈ ప్రాజెక్ట్‌పై మెగా ఫ్యాన్స్‌లో ప్రత్యేక ఉత్సాహం నెలకొంది.

ఈ కొత్త సినిమా వచ్చే నెలలో లాంఛనంగా ప్రారంభం కానుండగా, మార్చి నుంచి చిరంజీవి రెగ్యులర్ షూటింగ్‌లో పాల్గొననున్నారని సమాచారం. రస్టిక్ మాస్ యాక్షన్ డ్రామాగా రూపొందనున్న ఈ చిత్రానికి సంబంధించిన కథాంశంపై ఇప్పటికే ఆసక్తికరమైన టాక్ వినిపిస్తోంది. ఇది పూర్తిగా యాక్షన్‌కి మాత్రమే పరిమితం కాకుండా, బలమైన సెంటిమెంట్, ఎమోషన్‌తో కూడిన కథగా ఉంటుందని, ముఖ్యంగా “కూతురు సెంటిమెంట్” ఈ కథలో కీలకంగా నిలుస్తుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. తండ్రి–కూతురు మధ్య భావోద్వేగ బంధం, దానితో ముడిపడిన సంఘర్షణలు, యాక్షన్ ఎలిమెంట్స్ కలగలిపిన కథ చిరంజీవి ఇమేజ్‌కు కొత్త డైమెన్షన్ ఇవ్వనుందనే ప్రచారం జోరుగా సాగుతోంది.

ఈ కథలో మరో హైలైట్‌గా మలయాళ ఇండస్ట్రీ అగ్ర నటుడు మోహన్‌లాల్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారన్న వార్త అభిమానులను మరింత ఉత్సాహపరుస్తోంది. కథలో ఆయన పాత్ర చాలా కీలకమై ఉంటుందని, చిరంజీవితో స్క్రీన్ షేరింగ్ బలమైన ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందన్న టాక్ వినిపిస్తోంది. హీరోయిన్ల విషయంలో ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా, చిరంజీవికి కూతురిగా ఓ యంగ్ అప్‌కమింగ్ హీరోయిన్‌ను ఎంపిక చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే సమయంలో బాలీవుడ్ బ్యూటీ, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ కీలక పాత్రలో నటించనున్నారన్న ప్రచారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆమె పాత్ర ఏ స్థాయిలో ఉంటుందన్నది సస్పెన్స్‌గా మారింది. చిరంజీవి కెరీర్లో సిస్టర్ సెంటిమెంట్‌తో సినిమాలు వచ్చినా కూతురు సెంటిమెంట్‌తో ఇప్పటివరకు మూవీ రాలేదు. దీంతో ఈ చిత్రం ఆయన కెరీర్లోనే ఓ మైలురాయిగా నిలవనుందని సినీ వర్గాలు అటున్నాయి.

టెక్నికల్ టీమ్ విషయంలోనూ ఈ సినిమాకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. మాలీవుడ్ టాప్ సినిమాటోగ్రాఫర్ నిమిష్ రవి ఈ చిత్రానికి డీఓపీగా పని చేయనున్నారన్న సమాచారం ఉంది. అలాగే సంగీత దర్శకుడిగా ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ.ఆర్. రెహమాన్ పేరు వినిపించడం సినిమాపై అంచనాలను మరో మెట్టు ఎక్కిస్తోంది. అయితే మొదట సిద్ధం చేసిన కథకు దగ్గరగా ఇటీవల మరో సినిమా రావడంతో, కథలో కొన్ని కీలక మార్పులు చేసినట్లు సమాచారం. అందుకే చిరంజీవి–బాబీ కాంబోలో రాబోయే ఈ సినిమా పూర్తిగా కొత్త కాన్సెప్ట్‌తో, మాస్‌తో పాటు బలమైన ఎమోషన్ కలిగిన చిత్రంగా రూపుదిద్దుకుంటుందని టాక్. మెగాస్టార్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచేలా ఈ సినిమాను డిజైన్ చేస్తున్నారన్న వార్తలు అభిమానుల్లో భారీ హైప్‌ను క్రియేట్ చేస్తున్నాయి.

  Last Updated: 20 Jan 2026, 10:57 AM IST