Mega 157 మెగాస్టార్ చిరంజీవి 156వ సినిమా వశిష్ట డైరెక్షన్ లో చేస్తున్నాడు. బింబిసార తో సత్తా చాటిన వశిష్ట మెగాస్టార్ తో కూడా ఒక సెన్సేషనల్ మూవీకి సిద్ధమయ్యాడు. ఈ సినిమా మరో జగదేకవీరుడు అతిలోకసుందరి అవుతుందని మెగా ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. ఇదిలాఉంటే ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి 157వ సినిమా గురించి ఎక్స్ క్లూజివ్ డీటైల్స్ బయటకు వచ్చాయి. అసలైతే చిరు 157వ సినిమా కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో చేయాల్సింది కానీ అనివార్య కారణాల వల్ల ఆ సినిమా కుదరలేదు.
ఇక మెగా 157 డైరెక్టర్స్ రేసులో స్టార్ డైరెక్టర్స్ ఉన్నారు. ముఖ్యంగా రీసెంట్ గా హిట్ కొట్టిన అనిల్ రావిపుడితో చిరు సినిమా ఉంటుందని టాక్. పటాస్ నుంచి భగవంత్ కేసరి వరకు ఫ్లాప్ అంటే ఏంటో తెలియని డైరెక్టర్ అనిల్ రావిపుడి మెగాస్టార్ తో సినిమా చేస్తే ఆ లెక్క వేరేలా ఉంటుందని చెప్పొచ్చు.
We’re now on WhatsApp : Click to Join
చిరు కోసం అనిల్ ఆల్రెడీ ఒక ఎంటర్టైనింగ్ కథ రాసుకున్నారట. అయితే అనిల్ మెగాస్టార్ తో చంటబ్బాయ్ లాంటి సినిమా చేస్తారని కొందరు అంటున్నారు. వీరి కాంబినేషన్ లో ఎలాంటి సినిమా వచ్చినా ఫ్యాన్స్ మాత్రం సూపర్ హ్యాపీగా ఉంటారని చెప్పొచ్చు. భోళా శంకర్ ఫ్లాప్ తో డీలా పడ్డ చిరు మెగా స్టామినా చూపించాలని ఫిక్స్ అయ్యారుయ్. అందుకే ఇక మీదట రీమేక్ లకు ఫుల్ స్టాప్ పెట్టి ఒర్జినల్ కథలనే చేయాలని అనుకుంటున్నారు.
మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపుడి కాంబో సినిమా మెగా ఫ్యాన్స్ ని ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తుందని నమ్ముతున్నారు. మరి ఈ కాంబో పై అఫీషియల్ అప్డేట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.