Site icon HashtagU Telugu

Mega 157: మెగాస్టార్ చిరంజీవి – అనిల్ రావిపూడి, రఫ్ఫాడించేద్దాం.. ప్రోమో రిలీజ్…

Mega 157 With Anil Ravipudi

Mega 157 With Anil Ravipudi

టాలీవుడ్‌లో ఇప్పటివరకు ప్లాప్ మూవీ లేని డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకరు. వరుస బ్యాక్ టూ బ్యాక్ హిట్స్‌తో, చాలా తక్కువ కాలంలోనే స్టార్ డైరెక్టర్ల జాబితాలో చేరాడు. ఇప్పటికే సీనియర్ అగ్రహీరోలైన బాలయ్య, వెంకీతో సినిమాలు చేసి హిట్స్ అందుకున్న అనిల్, ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయబోతున్నాడు. నూతన తెలుగు సంవత్సరం ఉగాదిని పురస్కరించుకుని చిరు – అనిల్ సినిమాకు పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు.

తాజాగా, ఈ సినిమాకు పని చేయబోయే డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ బాయ్స్‌తో పాటు, అడిషనల్ డైలాగ్ రైటర్స్, కో రైటర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్, ఎడిటర్ తమ్మిరాజు, సంగీత దర్శకుడు భీమ్స్, డీవోపీ సమీర్, నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదెలను మెగాస్టార్ చిరంజీవికి పరిచయం చేస్తూ, ఒక స్పెషల్ వీడియోను అనిల్ రావిపూడి విడుదల చేశాడు.

ఇక చివరలో, తనదైన మార్క్ డైలాగ్‌లతో అనిల్ రావిపూడి, “రఫ్ఫాడించేద్దాం” అని చిరంజీవితో కలిసి సిగ్నేచర్ స్టెప్ వేసి ప్రోమో రిలీజ్ చేసాడు. ఈ సినిమాతో “మరొకసారి వింటేజ్ చిరుని చూపిస్తాను” అని అనిల్ రావిపూడి చెప్పకనే చెప్పాడని, ప్రోమో చూస్తే అర్థం అవుతుంది.

మెగా 157గా తెరకెక్కుతున్న ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చకచకా షూటింగ్ పూర్తి చేసి, 2026 సంక్రాంతి కానుకగా మెగా-నీల్ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.