Site icon HashtagU Telugu

Meera Vasudevan : ముచ్చటగా మూడో భర్త కు విడాకులు ఇచ్చిన హీరోయిన్

Meera Vasudevan 3rd Husband

Meera Vasudevan 3rd Husband

మలయాళ నటి మీరా వాసుదేవన్ వ్యక్తిగత జీవితంలో మరోసారి కీలక మార్పు చోటుచేసుకుంది. తన మూడో భర్త విపిన్‌తో కూడా విడాకులు తీసుకున్నట్లు ఆమె స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. 2025 ఆగస్టు నుంచి తాను పూర్తిగా సింగిల్‌గా ఉన్నానని స్పష్టం చేస్తూ, ఈ నిర్ణయం చాలా ఆలోచన తర్వాత తీసుకున్నదని పేర్కొన్నారు. తన అభిమానులకు ధైర్యం ఇచ్చేలా, జీవితంలో ఎదురయ్యే కష్టాలు మనల్ని మరింత బలంగా మార్చుతాయని, ముందుకు సాగడమే ముఖ్యమని మీరా పంచుకున్న విధానం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.

Rajasthan Royals: రాజస్థాన్ రాయల్స్ జ‌ట్టు కొత్త కోచ్ ఇత‌నే!

మీరా వ్యక్తిగత జీవితంలో వరుసగా ఎదురైన వివాహ వైఫల్యాలు ఎప్పుడూ వార్తల్లో నిలిచాయి. 2005లో విశాల్ అగర్వాల్ని ఆమె వివాహం చేసుకుంది. అయితే ఐదేళ్లకే ఇద్దరూ వేరు దారులు పట్టారు. తరువాత 2012లో నటుడు జాన్ కొక్కెన్‌ను వివాహం చేసుకోగా, వారికి ఒక బాబు పుట్టాడు. కానీ ఈ దాంపత్యం కూడా ఎక్కువ కాలం నిలవక 2016లో విడాకులతో ముగిసింది. 2024లో కెమెరామెన్ విపిన్‌తో కొత్త జీవితం ప్రారంభించిన మీరా, ఒకేసారి కెరీర్‌–వ్యక్తిగత జీవితం రెండింటిని సమతుల్యంగా నడిపేందుకు ప్రయత్నించారు. కానీ మళ్లీ పరిస్థితులు కలిసి రాకపోవడంతో ఈ సంబంధం కూడా ముగిసిందని ఆమె సూచించారు.

తెలుగు ప్రేక్షకులకు కూడా మీరా సుపరిచితమే. గోల్మాల్, అంజలి ఐ లవ్ యూ వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించారు. వివాహాలు, విడాకులు వ్యక్తిగత నిర్ణయాలని భావించినా, ఒక స్టార్‌గా ఆమె జీవితం పబ్లిక్ డొమైన్‌లో ఉండటం వల్ల ఈ మార్పులు తరచూ చర్చలకు దారితీస్తుంటాయి. అయితే తన జీవితాన్ని పెట్టుకోని ధైర్యంగా ముందుకు సాగుతున్న తీరు చాలా మందికి ప్రేరణగా నిలుస్తోంది.

Exit mobile version