Site icon HashtagU Telugu

Meera Jasmine: మొదటిసారి ఫ్యామిలీ ఫోటో ని షేర్ చేసిన మీరా జాస్మిన్.. పోస్ట్ వైరల్!

Meera Jasmine

Meera Jasmine

మీరా జాస్మిన్.. ఈ పేరు వినగానే ముందుగా గుర్తుకువచ్చే సినిమా గుడుంబా శంకర్, భద్ర ఈ సినిమాలతో పాటు ఈమె తెలుగులో చాలా సినిమాల్లో నటించినప్పటికీ ఈ రెండు సినిమాలు ద్వారా బాగా పాపులారిటీని సంపాదించుకుంది మీరాజాస్మిన్. అలాగే గోరింటాకు, పందెం కోడి లాంటి ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది మీరాజాస్మిన్. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఇటీవల ఇంట్లో తీవ్ర విషాదం కూడా నెలకొంది. ఏప్రిల్ నాలుగో తేదీన ఆమె తండ్రి జోసెఫ్ ఫిలిప్ కన్నుమూసారు.

We’re now on WhatsApp. Click to Join
కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం ఆరోగ్యం క్షీణించడంతో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. తండ్రి మరణంపై హీరోయిన్ మీరా జాస్మిన్ ఎమోషనల్ పోస్ట్ చేసింది. తన తండ్రి ఫోటోస్ షేర్ చేస్తూ.. మళ్లీ కలిసే వరకు ఇంతే అనంతమైన ప్రేమతో అంటూ భావోద్వేగానికి గురైంది. అలాగే తొలిసారి తన ఫ్యామిలీ ఫోటోస్ షేర్ చేసింది. తండ్రితో తనకున్న అనుబంధాన్ని చెప్పుకొచ్చింది. మా నాన్నగారు జోసెఫ్ ఫిలిఫ్ సన్ ఆఫ్ స్వర్గీయ ఫిలిఫ్ తలయిల్ పుతెన్వీటిల్ ఎలంథూర్ లో నివసిస్తుండేవారు. ఆ తర్వాత ముంబైకి షిఫ్ట్ అయ్యారు.

Also Read: Dil Raju: రెండో పెళ్లిపై వచ్చిన ట్రోల్స్ పై స్పందించిన దిల్ రాజు.. అవి చూసి నా భార్య అలా?

తిరువల్ల, కొచ్చి ప్రాంతాల్లో నివసించారు. ఆలేయమ్మ జెసెఫ్ భార్య పిల్లలు జియోమన్, జెనీ సూసన్, సారా రోబిన్, మీరా జాస్మిన్, జార్జ్, మనవళ్లు, మరదళ్లు, తమ్ముళ్లు ఇలా అందరితో ఎంతో సంతోషంగా జీవించారు. శనివారం ఆయన బాడీ మా వద్దకు వస్తుంది. ఆయన ఆత్మ శాంతి కోసం మాతోపాటు ప్రార్థనలు చేయండి.

 

మధ్యాహ్నం నుంచి ప్రేయర్స్ జరుగుతాయి. ఆదివారం నాలుగు గంటలకు అంత్యక్రియలు జరుగుతాయి అంటూ సుధీర్ఘ పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా మీరాజాస్మిన్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒకప్పుడు తెలుగు, తమిళంలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న మీరా జాస్మిన్.. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైంది. కొన్నాళ్లపాటు ఫ్యామిలీతో గడిపిన మీరా ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తుంది. తెలుగులో విమానం సినిమాతో మరోసారి బిగ్ స్క్రీన్ పై సందడి చేసింది.

Also Read: Balakrishna: బాలయ్య బాబు ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. NBK109కీ టైటిల్ ఫిక్స్?

Exit mobile version