మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary)..ప్రస్తుతం ఈ పేరు టాలీవుడ్ లో వైరల్ గా మారింది. 2018లో “మిస్ గ్రాండ్ ఇండియా” టైటిల్ గెలుచుకుని, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ.. “ఇచ్చట వాహనములు నిలుపరాదు” సినిమాతో తెలుగు లో పరిచమైంది. ఆ తర్వాత “ఖిలాడి,” “హిట్ 2” వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గుంటూరు కారం (Gunturu Kaaram) మూవీ లో మహేష్ కు జోడిగా నటించి మరింత క్రేజ్ తెచ్చుకుంది. ఈ సినిమా తో త్రివిక్రమ్ (Trivikram) దగ్గర మంచి మార్కులు కొట్టేయడం తో..గురూజీ ఈమెకు వరుస పెట్టి ఛాన్సులు ఇప్పిస్తున్నాడు.
రీసెంట్ గా లక్కీ భాస్కర్ (Lucky Baskar) మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం ‘మట్కా’, హీరో వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న మూవీలో నటిస్తుంది. ఇదిలా ఉండగానే తాజాగా మెగా ఆఫర్ కొట్టేసినట్లు ఫిలిం సర్కిల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ భామకు లేటెస్ట్‌గా చిరంజీవి(Chiranjeevi) సినిమాలో అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. చిరంజీవి ప్రస్తుతం వశిష్ట మల్లిడి దర్శకత్వంలో విశ్వంభర (Vishwambhara ) అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో మీనాక్షి దేవకన్యలా కనిపించనుందని సమాచారం. నిజముగా ఈ వార్త నిజమైతే అమ్మడికి ఇక తిరుగు ఉండదు.
Read Also : Sports Quota : ప్రభుత్వ ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా 3 శాతానికి పెంపు – చంద్రబాబు