Site icon HashtagU Telugu

Meenakshii Chaudhary : ‘గుంటూరు కారం’లో ఈ హీరోయిన్ ఫిక్స్.. స్వయంగా చెప్పేసిన హీరోయిన్..

Meenakshi Chaudhary Replace Pooja Hegde Place in Guntur Kaaram Movie

Meenakshi Chaudhary Replace Pooja Hegde Place in Guntur Kaaram Movie

మహేష్ బాబు(Mahesh Babu) గుంటూరు కారం(Guntur Kaaram) సినిమా గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తుంది. త్రివిక్రమ్(Trivikram) కాంబినేషన్ లో మహేష్ బాబు మూడవ సినిమా అంటూ చాలా గ్రాండ్ గా ఈ సినిమాని లాంచ్ చేశారు. కానీ అనేక కారణాలతో ఇప్పటికీ ఈ సినిమా సగం షూట్ కూడా పూర్తవ్వలేదు. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే(Pooja Hegde), శ్రీలీల(Sreeleela)ను హీరోయిన్స్ గా తీసుకోగా పూజా హెగ్డే సినిమా నుంచి తప్పుకుంది.

సరైన కారణం బయటకి రాకపోయినా గుంటూరు కారం షూట్ లేట్ అవుతుందని, తనకి డేట్స్ అడ్జస్ట్ అవ్వట్లేదని పూజా సినిమా నుంచి తప్పుకున్నట్టు సమాచారం. అయితే ఆ ప్లేస్ లోకి వేరే హీరోయిన్ ని తీసుకొని ఇటీవలే మళ్ళీ షూట్ మొదలుపెట్టారు. పూజా ప్లేస్ లో ఇద్దరు, ముగ్గురు హీరోయిన్స్ పేర్లు వినిపించాయి. కానీ తాజాగా హీరోయిన్ మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) తనే ఈ సినిమాలో చేస్తున్నట్టు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది .

హిట్, ఖిలాడీ లాంటి సినిమాల్లో తెలుగులో మెప్పించిన హీరోయిన్ మీనాక్షి చౌదరి ప్రస్తుతం విజయ్ ఆంటోనీతో హత్య అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా హైదరాబాద్ లో జరిగింది.

ఈ ఈవెంట్ లో మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. నాకు మొదటి నుంచి మహేష్ బాబు గారి మీద అభిమానం ఉంది. ఆయనతో సినిమా చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాను. అది ఇప్పుడు జరిగింది. ఫస్ట్ షెడ్యూల్ షూట్ అయిపోయింది. మొదటి రోజు మహేష్ తో మొదటి షాట్ ఇప్పటికి మర్చిపోలేను. మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అని తెలిపింది. దీంతో గుంటూరు కారం సినిమాలో పూజాహెగ్డే ప్లేస్ లో మీనాక్షి చౌదరిని తీసుకున్నట్టు క్లారిటీ వచ్చేసింది.

 

Also Read : Bhola Shankar : పవర్ స్టార్‌ని ఇమిటేట్ చేసిన మెగాస్టార్.. భోళా శంకర్ నుంచి ఫ్యాన్స్ కోసం అదిరిపోయే చిరు లీక్స్..