Site icon HashtagU Telugu

Meenakshi Chaudhary : మీనాక్షి నెక్స్ట్ లీడింగ్ హీరోయిన్..?

Meenakshi Chaudhary Next Leading Heroine in South

Meenakshi Chaudhary Next Leading Heroine in South

Meenakshi Chaudhary తెలుగులో ఉన్న హీరోయిన్స్ కొరతకు ప్రతి వీకెండ్ ఒక కొత్త హీరోయిన్ ఎంట్రీ ఇస్తున్నా సరే అందులో టాలెంట్ ఉండి స్టార్ మెటీరియల్ అనిపించే వారు చాలా తక్కువ అని చెప్పొచ్చు. అందం గురించి కాకపోయినా అభినయంతో ఆడియన్స్ ని మెప్పించే వారు చాలా తక్కువ మంది ఉన్నారు. అఫ్కోర్స్ అలాంటి వారు ఇప్పటికే ఆడియన్స్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు.

ఈ లిస్ట్ లో అందాల భామ మీనాక్షి చౌదరి కూడా ఉంటుంది. సుశాంత్ నటించిన ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అమ్మడు ఆ తర్వాత వరుస క్రేజీ ఛాన్సులు అందుకుంటుంది. మహేష్ తో గుంటూరు కారం సినిమాలో చిన్న పాత్రలో నటించిన మీనాక్షి కోలీవుడ్ లో ఏకంగా దళపతి విజయ్ తో జత కడుతుంది.

సినిమాలతో కన్నా సోషల్ మీడియా ఫోటో షూట్స్ తో మీనాక్షి చౌదరి ఎక్కువ అలరిస్తుంది. సినిమాల్లో తన పాత్రలతో కన్నా ఫోటో షూట్ లో తన గ్లామర్ షోతో అదర్గొట్టేస్తుంది. కచ్చితంగా అమ్మడికి రానున్న రోజుల్లో మంచి ఛాన్సులు వచ్చేలా ఉన్నాయి. ప్రస్తుతం తెలుగులో మీనాక్షి వరుణ్ తేజ్, వెంకటేష్ లాంటి స్టార్స్ తో నటిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమాలో కూడా అమ్మడు ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి అమ్మడి ఫీచర్స్ చూస్తుంటే కచ్చితంగా నెక్స్ట్ బిగ్ స్టార్ హీరోయిన్ అమ్మడు అయ్యేల ఉందని చెప్పొచ్చు.

Also Read : Tripti Dimri ఆ ప్రోత్సాహం మర్చిపోలేనిదంటున్న యానిమల్ బ్యూటీ..!