Meenakshi Chaudhary : గురూజీ గుర్తించాక ఆఫర్లు తన్నుకుంటూ రావాల్సిందే.. ఏకంగా వెంకటేష్ సరసన ఛాన్స్..!

Meenakshi Chaudhary ప్రస్తుతం తెలుగులో స్టార్ అయ్యేందుకు అన్ని క్వాలిటీస్ ఉన్న భామల్లో మీనాక్షి చౌదరి ఒకరు. సుశాంత్ నటించిన ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో తెలుగు తెరకు

Published By: HashtagU Telugu Desk
Meenakshi Chaudhary Three movies in line for release in Month period

Meenakshi Chaudhary Three movies in line for release in Month period

Meenakshi Chaudhary ప్రస్తుతం తెలుగులో స్టార్ అయ్యేందుకు అన్ని క్వాలిటీస్ ఉన్న భామల్లో మీనాక్షి చౌదరి ఒకరు. సుశాంత్ నటించిన ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మీనాక్షి చిన్నగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ స్టార్ క్రేజ్ దక్కించుకుంటుంది. ఖిలాడి, హిట్ 2 ఛాన్సులతో పాపులర్ అయిన మీనాక్షి సూపర్ స్టార్ మహేష్ నటించిన గుంటూరు కారం సినిమాలో మరదలి పాత్రలో సర్ ప్రైజ్ చేసింది.

త్రివిక్రం శ్రీనివాస్ మీనాక్షిని సరిగా వాడుకోలేదనే టాక్ వచ్చినా గుంటూరు కారం వల్ల మీనాక్షికి మాత్రం మంచే జరిగింది. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంలో కూడా వరుస సినిమాల్లో రాణిస్తుంది మీనాక్షి. సుశాంత్ తో చేసే టైం లోనే మీనాక్షి టాలెంట్ గుర్తించిన త్రివిక్రం గుంటూరు కారం లో ఛాన్స్ ఇచ్చాడు. గురూజీ గుర్తించాక ఆమెకు ఆఫర్లు రాకుండా ఉంటాయా.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో మట్కా సినిమా చేస్తున్న మీనాక్షి లేటెస్ట్ గా విక్టరీ వెంకటేష్ సినిమాలో ఛాన్స్ అందుకున్నట్టు తెలుస్తుంది. అనిల్ రావిపుడి, వెంకటేష్ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమాలో మీనాక్షి నటిస్తుందని టాక్. అదే నిజమైతే మాత్రం అమ్మడి రేంజ్ మారిపోయినట్టే అని చెప్పొచ్చు.

తమిళంలో విజయ్ గోట్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న మీనాక్షి ఆ సినిమా తర్వాత అక్కడ కూడా బిజీ హీరోయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కోలీవుడ్, టాలీవుడ్ లో రాబోయే రోజుల్లో మీనాక్షి స్టార్ హీరోయిన్ గా టాప్ ప్లేస్ ఆక్యుపై చేస్తుందని చెప్పొచ్చు.

Also Read : Siddharth : పాపం సిద్ధార్థ్.. అసూయకి బాధకు మధ్య స్థితి..!

  Last Updated: 14 Apr 2024, 07:25 PM IST