Samantha: మానసిక ఆరోగ్యానికి ధ్యానం ఎంతో మేలు: సమంత

ప్రస్తుతం ఆరోగ్యంపై దృష్టి పెట్టిన సమంత.. ఆధ్యాత్మికత వైపు కూడా దృష్టి సారించింది. 

Published By: HashtagU Telugu Desk
Sam

Sam

Samantha: టాలీవుడ్ నటి సమంత అనారోగ్య సమస్యలు, వివిధ కారణాల వల్ల కొంతకాలం సినిమాలకు దూరంగా ఉంటున్న ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆరోగ్యంపై దృష్టి పెట్టిన సమంత.. ఆధ్యాత్మికత వైపు కూడా దృష్టి సారించింది. తాజాగా కోయంబత్తూర్‌లోని ఈషా ఫౌండేషన్‌కు వెళ్లారు. ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ క్రమంలో అందరితో కలిసి ధ్యానం చేశారు. అనంతరం, ధ్యానంలో తనకెదురైన అనుభూతిని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ధ్యానం మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలని చెప్పింది. ధ్యానం సింపుల్.. కానీ పవర్‌ఫుల్ అంటూ సమంత తెలిపింది. శరీరంలో కదలికలు లేని నిశ్చలమైన స్థితి అసాధ్యమని తనకు ఇప్పటివరకూ అనిపించింది. కానీ ఈ రోజు ధ్యానస్థితి తనకు శక్తి, ఆలోచనల్లో స్పష్టత, ప్రశాంతను ఇచ్చిందని పేర్కొంది.

తమిళనాడులో పలు ఆధ్యాత్మిక ప్రాంతాలకు వెళ్తూ రీఛార్జ్ అవుతోంది.  సమంత ఇళయరాజా, భక్తి పాటలు తీర్థ యాత్రలు చేస్తున్న ఫొటోలు వైరల్ అయ్యాయి. ఒక ఏడాది పాటూ సినిమాలు చేయనని తీసుకున్న అడ్వాన్సులు కూడా తిరిగి ఇచ్చేసింది. నిర్మాతలు ఎంత వద్దని చెబుతున్నా…డబ్బులు ఇచ్చేసింది. సమంత నటించిన ఖుషి నటించిన సినిమా సెప్టెంబర్ 1 న విడుదల అవనుంది

Also Read: Eatala & DK Aruna: గృహనిర్బంధంలో ఈటల రాజేందర్, డీకే అరుణ!

  Last Updated: 20 Jul 2023, 11:41 AM IST