Mechanic Rocky : అమెజాన్ ప్రైమ్ లో ‘మెకానిక్ రాకీ’

Mechanic Rocky : థియేటర్స్ లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న ఈ మూవీ ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి

Published By: HashtagU Telugu Desk
Mechanic Rocky Glimpse

Mechanic Rocky Glimpse

విశ్వక్ సేన్ (Vishwak Sen) , మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary), శ్రద్దా శ్రీనాథ్ (Shraddha Srinath) జంటగా తెరకెక్కిన మూవీ ‘మెకానిక్ రాకీ’ (Mechanic Rocky). భారీ అంచనాల నడుమ నిన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో నరేష్ (Naresh) , సునీల్ (Sunil)..లు కీలక పాత్రలు చేయగా.. ‘ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై రామ్ తాళ్లూరి (Ram Talluri) ఈ చిత్రాన్ని నిర్మించారు. థియేటర్స్ లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న ఈ మూవీ ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. థియేటర్ రన్ పూర్తయ్యాక ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉందని తెలిపారు.

ఇక ఈ చిత్ర కథ విషయానికి వస్తే..

చదువు సరిగా అబ్బక మెకానిక్ అవుతాడు రాకేష్ అలియాస్ రాకీ (విశ్వక్ సేన్). తండ్రి నడిపిస్తున్న గ్యారేజ్ ను చూసుకుంటూ లైఫ్ సాగిస్తుంటాడు. ఐతే ఆ గ్యారేజ్ స్థలం మీద రంకిరెడ్డి (సునీల్) కన్ను పడుతుంది. మనుషులతో చెప్పించి ఖాళీ చేయించాలని చూసినా కుదరదు. ఐతే ఎలాగైనా ఆ ప్లేస్ ని దక్కించుకోవాలని ప్రయత్నించిన రంకిరెడ్డికి రాకీ అడ్డు తగులుతాడు. ఈ క్రమంలో తన కాలేజ్ లవ్ ప్రియ (మీనాక్షి) అతని లైఫ్ లోకి వస్తుంది. ఆమెతో పాటే తన దగ్గర డ్రైవింగ్ నేర్చుకునేందుకు శ్రద్ధ కూడా పరిచయం అవుతుంది. ఇంతకీ రాకీ ఎవరిని ప్రేమించాడు..? రంకిరెడ్డి తో గొడవ ఏమైంది..? ఇలాంటి విషయాలు తెలియాలంటే మెకానిక్ రాకీ చూడాలి.

విశ్లేషణ :

ఈమధ్య సినిమాలు రొటీన్ ప్యాట్రన్ లో నడిపిస్తూనే చివర్లో ట్విస్ట్ ఇస్తూ ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తున్నాయి. ఆ కోవలోనే మెకానిక్ రాకీ వస్తుంది. హీరో గ్యారేజ్ నడపడం అతని కాలేజ్ ఫ్రెండ్ పరిచయమవడం ఆమెలో ప్రేమను కొనసాగించడం ఇదంతా రొటీనే ఫస్ట్ హాఫ్ అంతా ఇలానే ఆల్రెడీ చూసేసిన సీన్స్ తోనే నింపేశారు. డైరెక్టర్ కూడా పక్కా పాత టెంప్లేట్ తోనే నడిపించాడు.

ఐతే సెకండ్ హాఫ్ లో ట్విస్టులు కాస్త రిఫ్రెషింగ్ అనిపిస్తాయి. అప్పటికే ఇదేం రొటీన్ సినిమా అని అనుకున్న వారికి ఓకే పర్లేదు అనిపిస్తుంది. ఐతే మళ్లీ క్లైమాక్స్ విషయంలో దర్శకుడు పట్టు కోల్పోతాడు. ఫస్ట్ హాఫ్ ఇంకాస్త బాగా రాసుకుని క్లైమాక్స్ మీద ఇంకా గురి పెట్టి ఉంటే మెకానిక్ రాకీ మంచి వర్తబుల్ సినిమా అయ్యుండేది.

ఇప్పటివరకైతే సినిమా జస్ట్ ఓకే అనిపిస్తుంది. విశ్వక్ సేన్ ఎనర్జీ సినిమాను కాపాడేస్తుందేమో చూడాలి. ఐతే సినిమా ఫస్ట్ హాఫ్ నిరాశ పరచడంతో సెకండ్ హాఫ్ మీద ఎక్కువ బాధ్యత ఉంది. ఐతే మళ్లీ క్లైమాక్స్ కి గ్రాఫ్ పడిపోతుంది. సినిమాలో కొన్ని సీన్స్ వర్క్ అవుట్ కాలేదు. ఓవరాల్ గా సినిమా రొటీన్ సీన్స్ తో కొన్ని ట్విస్ట్ లతో ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఐతే ప్రేక్షకుడి మూడ్ ని బట్టి సినిమాను ఎంజాయ్ చేసే ఛాన్స్ ఉంటుంది.

Read Also : Governor Statue : రాజ్‌భవన్‌లో గవర్నర్ విగ్రహం.. స్వయంగా ఆవిష్కరించిన ఆనంద్ బోస్

  Last Updated: 23 Nov 2024, 03:14 PM IST