మెగాస్టార్ చిరు చెప్పగానే.. ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలు కళ్లముందు కదలాడుతాయి. ఆయన డాన్సులు, ఫైట్స్ లు అదరహో అనిపిస్తాయి. చిరు నటనలోనే మెగాస్టార్.. కుకింగ్ లోనూ మెగాస్టార్ అనిపించుకుంటున్నారు. లాస్ట్ ఇయర్ లాక్ డౌన్ చిరు అద్భుతమైన వంటలు వండి మెగా కుటుంబాన్ని ఆశ్చర్చపర్చాడు. తాజాగా మరోసారి గరిటె తిప్పాడు.
భోగి సందర్భంగా చిరంజీవి దోసెలు వేశాడు. ‘బాస్ చిరంజీవితో దోశ మేకింగ్ 101… 2022 భోగి.. అందరికీ శుభాకాంక్షలు’ అని తెలిపాడు. చిరు దోసెలు వేస్తుండగా వరుణ్ తేజ్, సాయితేజ్ , వైష్టవ్ తేజ్, రాంచరణ్ ప్లేట్లు తీసుకొని తినడానికి సిద్ధంగా ఉన్నారు. చిరువేసిన దోసెలను చరణ్ తోపాటు ఫ్యామిలీ మెంబర్స్ కు వడ్డించాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.