Site icon HashtagU Telugu

Vyjayanthi Movies: వైజయంతీ సంస్థకు మే 9వ తేదీ స్పెషల్ ఎందుకు?

Vyjayanthi Movies

Vyjayanthi Movies

Vyjayanthi Movies: ప్రభాస్‌ కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. భారతీయ పౌరాణిక ఇతిహాసాల స్ఫూర్తితో ఫ్యూచరిస్టిక్‌ సైన్స్‌ ఫిక్షన్‌ కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. క్లాసిక్ హిట్ మహానటి తర్వాత డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఈ సినిమా విడుదల తేదీని తాజాగా అధికారికంగా వెల్లడించారు.

సలార్ మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈ పాన్ వరల్డ్ మూవీకి నాగ్ అశ్విన్ డైరెక్టర్. ఈ సినిమా రెగ్యులర్ మూవీ కాదు.. ఇప్పటి వరకు తెలుగు తెర పైనే కాదు.. ఇండియన్ స్క్రీన్ పైనే రాని కథాంశంతో రూపొందింది. అనౌన్స్ చేసినప్పుడు ఏదో మూవీ చేస్తున్నారే అనుకున్నారు కానీ.. ఎప్పుడైతే టీజర్ రిలీజ్ చేశారో అప్పుడు కల్కి ఎలా ఉండబోతుందో అందరికీ క్లారిటీ వచ్చింది. ఇటీవల ముంబాయిలో మీడియా ఇంట్రాక్షన్ తో కల్కి ఎలా ఉండబోతుందో నాగ్ అశ్విన్ క్లారిటీ ఇచ్చారు.

దీంతో కల్కి పై ఎక్స్ పెక్టేషన్స్ మరింతగా పెరిగాయి. సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. ఆతర్వాత వాయిదా వేశారు. ఇప్పుడు ఈ చిత్రాన్ని మే 9న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ మూవీని సుప్రసిదస్ధ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవితో అశ్వనీదత్ జగదేకవీరుడు అతిలోకసుందరి అనే సినిమాను నిర్మించింది. ఈ సినిమా టైమ్ లో వరదలు వచ్చాయి. అయినప్పటికీ ఈ మూవీ సంచలన విజయం సాధించింది. ఈ మూవీ 1990లో మే 9న విడుదల అయ్యింది.

ఇక ఇదే సంస్థ మహానటి అనే సినిమాను నిర్మించింది. అలనాటి నటి సావిత్రి జీవిత కథగా ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. సావిత్రి పాత్రను కీర్తి సురేష్ నటించింది. సావిత్ర పాత్రను అద్భుతంగా పోషించినందుకు కీర్తి సురేష్ జాతీయ ఉత్తమనటిగా అవార్డ్ కూడా దక్కించుకుంది. ఇంతటి విజయాన్నా అందించిన ఈ సినిమా 2018లో మే 9న విడుదలైంది. ఇలా వైజయంతీ సంస్థకు మే 9 అనేది ఎప్పటికీ మరచిపోలేని తేదీ. ఇప్పుడు ఇదే తేదీకి ప్రభాస్ తో నిర్మిస్తోన్న పాన్ వరల్డ్ మూవీ కల్కిని విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు. మరి.. ఈ మ్యాజిక్ డేట్.. మరోసారి మ్యాజిక్ చేస్తుందేమో చూడాలి.

Also Read: HanuMan vs Adipurush: ఆదిపురుష్ వర్సెస్ హనుమాన్

Exit mobile version