Master Bharath : ‘రెడీ’ నటుడు ఇంట్లో విషాదం

Master Bharath : భరత్‌ చిన్నప్పటి నుండి నటన, కామెడీ టైమింగ్‌తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. ‘రెడీ’, ‘దూకుడు’, ‘వెంకీ’, ‘పోకిరి’ వంటి పలు హిట్ సినిమాల్లో తనదైన శైలిలో నటించి తెలుగు ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించాడు

Published By: HashtagU Telugu Desk
Bharath Mother

Bharath Mother

రెడీ ఫేమ్ మాస్టర్ భరత్‌ (Master Bharath) ఇంట్లో విషాద ఛాయలు అల్లుకున్నాయి. అతడి తల్లి కమలాహాసి(Kamalasiini)ని మే 18, ఆదివారం నాడు చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు. రాత్రి 8 గంటల సమయంలో ఆమె తుది శ్వాస విడిచారు. ఆమె మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు, బంధుమిత్రులు భరత్ ఇంటికి చేరుకుని పరామర్శిస్తున్నారు. తల్లిని కోల్పోయిన భరత్ తీరని దు:ఖంలో మునిగిపోయాడు. ఆయనకు దేవుడు ధైర్యాన్ని ప్రసాదించాలని అందరూ ప్రార్థిస్తున్నారు.

Yusuf Pathan : అఖిల పక్ష బృందం నుంచి పఠాన్ ఔట్.. టీఎంసీ సంచలన నిర్ణయం

భరత్‌ చిన్నప్పటి నుండి నటన, కామెడీ టైమింగ్‌తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. ‘రెడీ’, ‘దూకుడు’, ‘వెంకీ’, ‘పోకిరి’ వంటి పలు హిట్ సినిమాల్లో తనదైన శైలిలో నటించి తెలుగు ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించాడు. చిన్నప్పుడు బుగ్గలతోపాటు పటిష్టమైన డైలాగ్ డెలివరీ భరత్‌కి ప్రత్యేక గుర్తింపునిచ్చింది. కానీ వయస్సు పెరిగిన తర్వాత ఆయనకు పూర్తిగా నటుడిగా స్థిరపడటంలో వెనుకపడ్డాడు. ఇక ఇప్పుడు తల్లి అకాల మృతితో తీవ్ర విషాదంలో ఉన్న భరత్, ఈ దుఃఖాన్ని అధిగమించి మళ్లీ సినీరంగంలో తనకంటూ స్థానం ఏర్పరుచుకోవాలని కోరుతున్నారు.

  Last Updated: 19 May 2025, 02:31 PM IST