హైదరాబాద్ RTC X Road లోని సుదర్శన్ థియేటర్ (Sudarshan 35MM Theatre) లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఎన్టీఆర్ (NTR) నటించిన దేవర (Devara) మూవీ ఈరోజు భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చి నెగిటివ్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ నుండి సోలో మూవీ వచ్చి ఆరేళ్ళు అవుతుండడం తో అంత ఈ మూవీ ఫై అంచనాలు తారాస్థాయి లో పెట్టుకున్నారు. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమాను నిర్మాతలు భారీ ఎత్తున రిలీజ్ చేసారు. హైదరాబాద్ లో అయితే అర్ధరాత్రి నుండే షోస్ మొదలయ్యాయి.
ఈ క్రమంలో ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సుదర్శన్ థియేటర్ దగ్గర దేవర కటౌట్ (NTR Cutout)కు నిప్పంటుకుంది. థియేటర్ ఆవరణలో ఉన్న ఎన్టీఆర్ కటౌట్‌కు ఎవరో నిప్పు పెట్టారు. దీంతో కటౌట్ మంటల్లో కాలిపోయింది. మంటలు ఎగసి పడటంతో వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. అయితే ఇది కావాలని పెట్టారా..లేక టపాసులు కాల్చుతుండగా.. ప్రమాదవశాత్తూ కటౌట్‌కు నిప్పు అంటుకుందా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. దేవర కటౌట్ మంటల్లో కాలిపోవడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఈ ఘటనపై అభిమానులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసారు. కొంత మంది ఓర్వలేక.. ఈ చర్యకు దిగారంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. పోలీసులు ఎలాంటి గొడవలు జరగకుండా కంట్రోల్ చేసారు. ఇదిలా ఉంటె కడప అప్సర థియేటర్ లో ఒక అభిమాని సినిమా చూస్తూ గుండెపోటుతో మరణించారు. ఈ ఘటన అతడి కుటుంబంలోనే కాదు అభిమానుల్లోను విషాదం నింపింది.
Read Also : ED Raids : మంత్రి పొంగులేటి నివాసంలో ఈడీ అధికారుల సోదాలు