Site icon HashtagU Telugu

OG Teaser: అర్జున్‌ దాస్‌ వాయిస్‌ ఓవర్‌తో పవన్ “ఓజీ” మూవీ టీజర్‌.. 72 సెకన్లు విధ్వంసమేనా..!?

OG Teaser

Compressjpeg.online 1280x720 Image 11zon

OG Teaser: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) భారీగా ఆశలు పెట్టుకున్న సినిమా ‘ఓజీ’. ఈ సినిమా టీజర్ (OG Teaser) పవన్ పుట్టినరోజు కానుకగా రానుంది. అయితే ఈ టీజర్ పై నెట్టింట ఓ వార్త చక్కర్లు కొడుతోంది. 72 సెకన్లతో టీజర్ కట్ చేసినట్టు సమాచారం. ఈ సినిమాలో తమిళ నటుడు అర్జున్‌ దాస్‌ (Arjun Das) కీలకపాత్ర పోషిస్తున్నాడు. అతని వాయిస్ ఓవర్ తో సినిమా టీజర్ ను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.

బ్రో సినిమాతో అభిమానులను అలరించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో ‘ఓజీ’ సినిమాతో ఫ్యాన్స్ ముందుకు రాబోతున్నారు. రన్ రజా రన్, సాహో చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న సుజీత్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ప్రీ లుక్‌ పోస్టర్‌తోనే ఈ మూవీపై భారీ అంచనాలు క్రియేట్ చేశాడు. సాహో తర్వాత ఐదేళ్లు విరామం తీసుకున్న సుజీత్‌ ఇప్పుడు పవన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ మూవీలో గ్యాంగ్ స్టర్ గా పవన్‌ని చూపెట్టబోతున్నాడు. పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ నిర్మాత డివీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా మూడు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు సమాచారం.

ఈ చిత్రం ముంబై గ్యాంగ్ స్టర్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో పవన్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా చేస్తుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ, తమిళ నటుడు అర్జున్ దాస్, శ్రీయారెడ్డిలు, మరి కొంతమంది స్టార్స్ నటిస్తున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.

Also Read: CM KCR : అల్లు అర్జున్‌కి, అవార్డు విన్నర్స్‌కి ప్రత్యేక అభినందనలు తెలిపిన సీఎం కేసీఆర్..

అయితే ఈ సినిమా టీజర్ ని పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సెప్టెంబర్ 2న రిలీజ్ చేస్తామని మూవీ యూనిట్ ప్రకటించారు. అందుకు సంబంధించి టీజర్ పోస్టర్ రిలీజ్ చేసి రాబోయే టీజర్ పై మరింత హైప్ పెంచారు. OG సినిమా టీజర్ ని అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ తో చెప్పించనున్నటు తెలుస్తుంది. ఇక ఈ టీజర్ 72 సెకన్లు పాటు ఉంటుందని సమాచారం అందుతుంది. అర్జున్ దాస్ గంభీరమైన వాయిస్ కి తమిళ్ తో పాటు తెలుగులో కూడా అభిమానులు ఉన్నారు. దాంతో ఈ టీజర్ మరింత స్పెషల్ గా మారుతుందని అంతా భావిస్తున్నారు.