టాలీవుడ్ హీరో మాస్ మహారాజా రవితేజ గురించి మనందరికీ తెలిసిందే. రవితేజ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తున్నప్పటికీ సినిమాలేవి కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ అవ్వడం లేదు. ధమాకా సినిమా తరువాత సరైన హిట్టు పడలేదు. మిస్టర్ బచ్చన్ సినిమా కూడా అభిమానులను భారీగా నిరాశపరిచింది. ఈ మధ్యకాలంలో రవితేజ నటిస్తున్న సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలుస్తూ ఉండడంతో అభిమానులు మండిపడుతున్నారు. దీంతో తన తదుపరి సినిమాతో ఎలా అయినా సక్సెస్ ని అందుకోవాలని గట్టిగానే ప్లాన్ చేశారు రవితేజ.
బాక్సాఫీస్ దగ్గర మాస్ జాతరకి సై అంటున్నాడు. రవితేజ ఇపుడు హీరోగా నటిస్తున్న సాలిడ్ ఎంటర్టైనర్ సినిమా మాస్ జాతర. డైరెక్టర్ భాను భోగవరపు తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ షెడ్యూల్ తర్వాత దాదాపు టాకీ పార్ట్ అంతా పూర్తి అయిపోయినట్టే అని తెలుస్తోంది. రవితేజ లోని ఎనర్జీని పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకుంటూ ఈ సినిమా చేస్తున్నారట. ధమాకా తర్వాత మరోసారి రవితేజకు జంటగా శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంటే, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఈ రెండు విషయాలు సినిమాపై స్పెషల్ బజ్ ను క్రియేట్ చేస్తున్నాయి.
ఇటీవల రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఈ సినిమాలో రవితేజకు తాతగా నటించాను. సినిమా అదిరిపోయింది అని చెప్పారు. రవితేజ ఫ్యాన్స్ ఈ మధ్య మిస్ అవుతున్న కామెడీ, మాస్ మిక్స్ చేసి ఈ మాస్ జాతర సినిమాలో పెడుతున్నారట. అంతేకాకుండా ఈ సినిమాలో రవితేజ కెరీర్లో భారీ హిట్ ఇడియట్ సినిమా నుంచి సూపర్ హిట్ సాంగ్ చూపుల్తో గుచ్చి గుచ్చి సాంగ్ ని రీమిక్స్ చేయనున్నారంటూ రూమర్స్ వినిపించాయి. కానీ ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది వేచి చూడాలి మరి. ఆ పాట అప్పటి నుంచి ఇప్పటి వరకు మంచి ఊపు తెప్పించిన పాట. ఒకవేళ అదే నిజమైతే ఇప్పుడు మరోసారి థియేటర్స్ లో ఫ్యాన్స్, ఆడియన్స్ రచ్చ చేయడం కంఫర్మ్. అంతేకాకుండా ఒకవేళ ఈ పాటను రీమిక్స్ చేస్తే మాత్రం థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయం అని చెప్పాలి.