Site icon HashtagU Telugu

Gangs of Godavari: మేము గోదారోళ్ళం.. మాటొకటే సాగదీస్తాం, తేడా వస్తే నరాలు తీసేస్తాం

Gang Of Godavari

Gang Of Godavari

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ వైవిధ్యమైన సినిమాలు చేసుకుంటూ తనకంటూ ఓ పేరు తెచ్చుకున్నాడు. తన మాస్ ఇమేజ్ కు తగ్గట్టుగా సినిమాలు చేసుకుంటూ దూసుకెళ్తున్నాడు. ఇటీవల ధమ్కీ సినిమాతో ఆకట్టుకున్న ఈ యంగ్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ పీరియాడిక్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకు గాంగ్స్ ఆఫ్ గోదావరి (Gangs of Godavari) అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు.  సినిమా కు సంబంధించిన షూట్ ఇటీవల చాలా రోజుల పాటు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిగింది.

ఇప్పటి వరకు నలభై శాతం వరకు వర్క్ పూర్తయిన ఈ సినిమా రఫ్ అండ్ సీరియస్ పొలిటికల్ టచ్ తో సాగుతుంది. విష్వక్ సేన్ ఇలాంటి సబ్జెక్ట్ చేయడం, పైగా పీరియాడిక్ సినిమా చేయడం ఇదే తొలిసారి. తాజాగా ఈరోజు ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్‌తో పాటు టైటిల్‌ను విడుదల చేశారు. విశ్వక్సేన్ రఫ్ అండ్ మాస్ అవతార్‌లో అదరగొట్టాడు. తాజాగా విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్ మాత్రం అదరగొట్టింది.

ఈ సినిమా రఫ్ అండ్ సీరియస్ పొలిటికల్ టచ్‌తో సాగనుందని తెలుస్తోంది. ఫస్ట్ గ్లింప్స్ లోకి వెళ్తే… గోదావరి జిలాల్లో జరిగే మాస్ యాక్షన్ డ్రామా అని తెలుస్తుంది. ‘‘మేము గోదారోళ్ళం.. మాటొకటే సాగదీస్తాం, తేడా వస్తే.. నవ్వుతూ నరాలు తీసేస్తాం’’ అంటూ విశ్వక్‌సేన్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. నేహాశెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా, అంజలి, నాజర్ లాంటివాళ్లు కీలక ప్రాతల్లో నటింస్తుండటం ఈ మూవీకి అదనపు ఆకర్షణ. ఈ మూవీకి క్యాచీ టైటిల్ పెట్టడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలను రేపుతోంది. టైటిల్ కు తగ్గట్టే సినిమా కథ, కథనం ఉండబోతుందని తెలుస్తోంది.

Also Read: MLC Kavitha: నిజామాబాద్ ఐటీ హబ్ లో కంపెనీని స్థాపించండి: ఎమ్మెల్సీ కవిత