తెలుగు ప్రేక్షకులకు నందమూరి హీరో కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం నిర్మాతగా హీరోగా ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. ఇటీవల విడుదల అయిన దేవర సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు కళ్యాణ్ రామ్. ఈ సినిమా కంటే ముందుగా బింబిసార, డెవిల్ వంటి రెండు సినిమాలలో హీరోగా నటించడంతో పాటు ఈ రెండు సినిమాలతో సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్నారు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాలో సూపర్ హిట్ గా నిలిచాయి. అయితే ఇప్పుడు అదే ఊపుతో మరో సినిమాలో హీరోగా నటించారు కళ్యాణ్ రామ్.
ఈ కొత్త సినిమాతో ఇప్పుడు ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నారు.. ఇంతకీ ఆ సినిమా ఏది ఎప్పుడు విడుదల కాబోతోంది అన్న వివరాల్లోకి వెళితే.. కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ఈ సినిమాకు ఇదే టైటిల్ ని ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో తల్లి పాత్రలో విజయశాంతి నటిస్తుండగా కొడుకు పాత్రలో కళ్యాణ్ రామ్ నటిస్తున్నారు. వైజయంతి ఐపీఎస్ గా విజయశాంతి కొడుకు అర్జున్ గా కళ్యాణ్ రామ్ కనిపించబోతున్నారు. అయితే ఇప్పటికే ఈ రెండు పాత్రలకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేసిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఈ సినిమా గురించి వినిపిస్తున్న వార్తలు ఈ సినిమాపై ఉన్న అంచనాలు చూస్తుంటే ఈ సినిమా మరొక పటాస్ లేదంటే బింబిసార అవ్వడం ఖాయం అని తెలుస్తోంది. తప్పకుండా ఈ సినిమా పాజిటివ్ హిట్ అవుతుందని అభిమానులు అలాగే మూవీ మేకర్స్ భావిస్తున్నారు. ఈ సమయంలో ఈ సినిమా నుంచి మరొక పాట లేదంటే ఏదైనా మంచి అప్డేట్ వస్తే మాత్రం ఈ సినిమా హిట్ అవడం గ్యారెంటీ అని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ మూవీని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో కళ్యాణ్ రామ్ సరసన సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుడగా, సోహైల్ ఖాన్ విలన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీని మూవీ మేకర్స్ ఇంకా ప్రకటించలేదు.