Prabhas Raja Saab : రాజా సాబ్ కోసం 4 రోజుల్లో 4 కోట్లు.. ప్రభాస్ రేంజ్ కి తగ్గట్టే..!

Prabhas Raja Saab పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా రాజా సాబ్. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

Published By: HashtagU Telugu Desk
Maruthi About Prabhas Raja Saab Movie Budget

Maruthi About Prabhas Raja Saab Movie Budget

Prabhas Raja Saab పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా రాజా సాబ్. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. బాహుబలి నుంచి కంప్లీట్ గా అన్నీ సీరియస్ సినిమాలు చేస్తూ వస్తున్న ప్రభాస్ ఈసారి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసేందుకు కామెడీ, హర్రర్ నేపథ్యాన్ని ఎంచుకున్నాడు. మారుతి మార్క్ ఎంటర్టైనర్ గా వస్తూనే రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఆశించే కమర్షియల్ అంశాలు ఈ సినిమాలో ఉండేలా చూస్తున్నారట.

ఈ సినిమాలో ప్రభాస్ సరసన మాలవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమా షూటింగ్ విశేషాల గురించి రీసెంట్ గా మాట్లాడిన మారుతి రాజా సాబ్ కోసం 4 రోజుల్లో 4 కోట్ల ఖర్చు చేసినట్టు చెప్పుకొచ్చాడు. అయితే తను చేసిన మొదటి సినిమా ఈరోజుల్లో కేవలం 30 లక్షల తో పూర్తైందని.. సినిమా ప్రభాస్ రేంజ్ కు తగినట్టుగా ఉంటుందని చెప్పుకొచ్చాడు.

ప్రభాస్ మారుతి ఈ కాంబో మూవీ అనగానే ఫ్యాన్స్ లో టెన్షన్ మొదలైంది. అయితే ప్రభాస్ ఎందుకు ఈ సినిమా ఎంపిక చేసుకున్నాడో సినిమా వచ్చాక తెలుస్తుంది. మారుతి ఈ సినిమాతో స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరాలని ఫిక్స్ అయ్యాడు. ఈ సినిమాను 2025 సంక్రాంతికి రిలీజ్ లాక్ చేశారు.

Also Read : Venky @ 20 Years : ‘వెంకీ’ కి 20 ఏళ్లు..

  Last Updated: 26 Mar 2024, 11:57 AM IST