ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు (Pawan Son) మార్క్ శంకర్ (Mark Shankar) తాజాగా సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ఒక ప్రైవేట్ స్కూల్‌లో అకస్మాత్తుగా జరిగిన ఈ అగ్నిప్రమాదంలో శంకర్ చేతులు, కళ్లకు గాయాలు అయ్యాయి. పొగ ఊపిరితిత్తుల్లోకి వెళ్లడంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న పవన్ కళ్యాణ్ వెంటనే విశాఖపట్నం నుంచి సింగపూర్ వెళ్లారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి తన భార్య సురేఖతో కలిసి సింగపూర్ వెళ్లారు. ప్రస్తుతం మార్క్ శంకర్ కు అక్కడి ఆసుపత్రిలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
John Cena- Virat Kohli: విరాట్ కోహ్లీ గురించి సోషల్ మీడియాలో షేర్ చేసిన స్టార్ రెజ్లర్ జాన్ సీనా
ఈ వార్త తెలిసిన వెంటనే సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. తాజాగా ఆసుపత్రి నుంచి విడుదలైన ఫోటోలో ఆయన క్షేమంగా ఉన్నట్టు స్పష్టమవుతోంది. పాపం చిన్నారి బాగోలేదని తెలిసి కలత చెందిన అభిమానులు ఇప్పుడు మళ్లీ ఊపిరి పీల్చుకున్నారు. పవన్ మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం మార్క్ పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందని తెలిపారు. ఎమర్జెన్సీ వార్డు నుంచి సాధారణ గదికి షిఫ్ట్ చేశారని తెలిపారు. మార్క్ శంకర్ ఆరోగ్యం క్రమంగా మెరుగవుతున్నప్పటికీ, చికిత్స పూర్తయ్యే వరకు ఆసుపత్రిలోనే ఉండనున్నాడు. స్కూల్‌లో జరిగిన అగ్నిప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Exclusive Visuvals…ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కుమారుడు మార్క్ శంకర్ కు గాయాలు .. సింగపూర్ లోని రివర్ వేలి రోడ్డులోని… రోడ్ షాప్ హౌజ్ అనే మూడడుగుల బిల్డింగ్ లో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో శంకర్ కు గాయాలు .. రెండో అంతస్తులోని టొమాటో స్కూల్🙏🙏#singaporeschool pic.twitter.com/8Hin42VCCw
— Ravindra Kumar Bandaru (@Ravindr59434697) April 8, 2025