Mark Antony : హమ్మయ్య కోర్టులో సినిమాకు క్లియరెన్స్ తెచ్చుకున్న విశాల్.. మార్క్ ఆంటోనీ రిలీజ్..

విశాల్ తమిళ అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ దగ్గర ఆ డబ్బు తీసుకొని కట్టారు. లైకా వాళ్ళకి తన నెక్స్ట్ సినిమా రైట్స్ ఇస్తాను అని, మిగిలిన డబ్బు చెల్లిస్తాను అని చెప్పారు.

Published By: HashtagU Telugu Desk
Mark Antony movie gets clearance in Court releasing on September 15th

Mark Antony movie gets clearance in Court releasing on September 15th

హీరో విశాల్(Vishal) ‘మార్క్ ఆంటోని'(Mark Antony) సినిమాతో రాబోతున్నాడు. సెప్టెంబర్ 15న ఈ సినిమా రిలీజ్ కానుందని గతంలోనే ప్రకటించారు. కానీ ఈ సినిమాపై స్టే విధించాలని తమిళ అగ్ర నిర్మాణ సంస్థ లైకా(Lyca) చెన్నై హైకోర్టుకి వెళ్ళింది. విశాల్ తన సినిమాలు తన సొంత నిర్మాణ సంస్థలోనే తెరకెక్కిస్తున్నారు. దీంతో బయట ఒకరిదగ్గర దాదాపు 22 కోట్లు అప్పుగా తెచ్చుకున్నారు. అది ఇచ్చిన టైములో తిరిగి ఇవ్వకపోవడంతో విశాల్ ని వాళ్ళు ఇబ్బంది పెట్టారు.

దీంతో విశాల్ తమిళ అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ దగ్గర ఆ డబ్బు తీసుకొని కట్టారు. లైకా వాళ్ళకి తన నెక్స్ట్ సినిమా రైట్స్ ఇస్తాను అని, మిగిలిన డబ్బు చెల్లిస్తాను అని చెప్పారు. అయితే మార్క్ ఆంటోనీ సినిమా రైట్స్ బయటి వాళ్ళకి ఇవ్వడం, డబ్బులు కూడా చెల్లించకపోవడంతో లైకా సంస్థ విశాల్ పై కోర్టులో కేసు వేసి సినిమా రిలీజ్ పై స్టే తెచ్చింది. దీంతో మార్క్ ఆంటోనీ సినిమా రిలీజ్ ఆగిపోతుందేమో అని అంతా భావించారు.

నేడు కేసు కోర్టు విచారణకు రాగా విశాల్ కోర్టుకి హాజరయ్యారు. అయితే కోర్టులో ఏం జరిగిందో లేదా విశాల్ లైకా వాళ్ళకి ఏం చెప్పాడో, డబ్బులు కట్టేశాడో తెలీదు కానీ మార్క్ ఆంటోని సినిమా రిలీజ్ పై ఉన్న స్టేని ఎత్తేసింది హైకోర్ట్. దీనిపై విశాల్.. మార్క్ ఆంటోనీ సినిమాకు క్లియరెన్స్ ఇచ్చింది హైకోర్టు. అన్ని అడ్డంకులు తొలిగిపోయాయి. సెప్టెంబర్ 15న మార్క్ ఆంటోనీ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. హిందీలో సెప్టెంబర్ 22న రిలీజ్ కానుంది అని ట్వీట్ చేశాడు.

మార్క్ ఆంటోనీ యాక్షన్ కామెడీ థ్రిల్లర్ టైం ట్రావెల్ కాన్సెప్ట్స్ కలిసి సరికొత్తగా రాబోతుంది. ఇందులో విశాల్ రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడు. రీతూ వర్మ, అభినయ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. SJ సూర్య ముఖ్య పాత్ర పోషించగా సునీల్ విలన్ గా నటించారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కింది. ఇప్పటికే రిలీజయిన మార్క్ ఆంటోని ట్రైలర్ తో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

 

Also Read : Indian2: శంకర్ కు షాక్ ఇచ్చిన సుకుమార్, ఇండియన్2 రిలీజ్ కు చిక్కులు

  Last Updated: 12 Sep 2023, 07:02 PM IST