Site icon HashtagU Telugu

Manthan : ఈ సినిమాకి 5 లక్షలమంది నిర్మాతలు తెలుసా..?

Manthan Movie Produced by Five Lakhs Members

Manthan Movie Produced by Five Lakhs Members

సినిమాకి నిర్మాత(Producer) అంటే ఎంతమంది ఉంటారు..? ఒకరు లేదా ఇద్దరు, లేదంటే ఒక మూడు నాలుగు సంస్థలు కలిసి ఒక చిత్రాన్ని నిర్మించడం మనమందరం చూసే ఉంటాము. కానీ ఒక సినిమాకి 5 లక్షల మంది నిర్మాతలుగా వ్యవహరించిన విషయం మీకు తెలుసా..? ఇది ఏదో హాలీవుడ్ సినిమా అనుకుంటారు ఏమో.. అసలు కాదు. మన భారతీయ సినిమానే. ఐదు లక్షల మంది రైతులు కలిసి ఒక సినిమాని నిర్మించారు. ఆ సినిమా పేరే ‘మంథన్‌’(Manthan). ఇది ఒక బయోపిక్.

భారతదేశంలో పాల ఉత్పత్తిని పెంచడం కోసం ఎంతో కృషి చేసిన శ్వేత విప్లవ పితామహుడు ‘వర్గీస్‌ కురియన్‌'(Verghese Kurien) లైఫ్ స్టోరీ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. దాదాపు 18 సినిమాలకి నేషనల్ అవార్డు అందుకున్న దిగ్గజ దర్శకుడు శ్యామ్‌ బెనెగల్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. గుజరాత్‌ పాడి రైతుల జీవితాలకు వర్గీస్‌ రాక ఒక వెలుగైంది. అలాంటి వ్యక్తి సినిమా నిర్మాణం రైతులు భాగస్వామ్యంతో జరుగుతూనే సముచితం అనే దర్శకుడు భావించారు. దీంతో గుజరాత్‌ కో ఆపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ లిమిటెడ్‌ కి ఆయన ఆలోచన చెప్పారు.

ఆ గొప్ప ఆలోచనకి మెచ్చి ఆ ఫెడరేషన్‌ లో భాగస్వాములుగా ఉన్న ఐదు లక్షల మంది రైతులు.. మనిషికి రూ.2 చొప్పున సినిమా నిర్మాణంలో పెట్టారు. ఇలా క్రౌడ్‌ ఫండింగ్‌ తో సినిమా చేయడం ప్రపంచం అంతకుముందు జరిగిన సందర్భాలు ఉన్నాయి. కానీ 5 లక్షల మంది ఫండింగ్‌ చేయడంతో.. ప్రపంచంలోనే ఎక్కువమంది నిర్మించిన సినిమాగా చరిత్ర సృష్టించింది. ఇండియాలో క్రౌడ్‌ ఫండింగ్‌ తో వచ్చిన మొదటి సినిమా అంటే.. అది ఇదే. ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యాక చూడటానికి రైతులు ఎద్దుల బళ్ళు కట్టుకొని గుంపులుగుంపులుగా థియేటర్లకు వచ్చారట.