మన్సూర్ అలీఖాన్ (Mansoor Ali Khan)..గత పది రోజులుగా ఈ పేరు మీడియా లో హల్చల్ చేస్తుంది. తెలుగు తో పలు భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించి పేరు తెచ్చుకున్న మన్సూర్ ..తాజాగా త్రిష (Trisha) ఫై చేసిన వ్యాఖ్యలు ఆయన్ను వివాదంలోకి నెట్టేశాయి. లియో సినిమాలో త్రిషతో రేప్ సీన్ ఉంటుందని భావించానని, కానీ ఆ సీన్ లేకపోవడం తనను నిరాశకు గురిచేసిందని మన్సూర్ అలీఖాన్ అన్నారు. ఈ వ్యాఖ్యల ఫై త్రిషకు సపోర్ట్‌గా ఖుష్బూ, చిరంజీవి (Chiranjeevi) సహా పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో తమ నిరసనను తెలిపారు. అలాగే పలువురు రాజకీయ నేతలు , మహిళా సంఘాలు సైతం మన్సూర్ ఫై మండిపడ్డారు. త్రిష కు మన్సూర్ క్షేమపణలు చెప్పాలని డిమాండ్ చేసారు. దీంతో ఆయన క్షేమపణలు తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join.
కానీ ఇప్పుడు ఆయన మళ్ళీ ఈ వివాదాన్ని తెరపైకి తీసుకువస్తున్నట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. తనపై కామెంట్స్ చేసిన త్రిష, కుష్బూ, చిరంజీవి పై కేసు నమోదు చేయడానికి మన్సూర్ సిద్దమయ్యారట. తనపై త్రిష, చిరంజీవి, కుష్బూ తదితరులు అవనసరంగా నోరు పారేసుకున్నారని, తనను మానసికంగా బాధించారని పేర్కొంటూ వారిపై పరువునష్టం దావా వేస్తున్నానని, క్రిమినల్ కేసు కూడా దాఖలు చేస్తున్నానని మన్సూర్ అలీఖాన్ తెలిపినట్లు పలు తమిళ్ మీడియా సంస్థలలో ప్రచారం జరుగుతుంది. మరి నిజంగా మన్సూర్ కేసు పెట్టబోతున్నారా అనేది తెలియాల్సి ఉంది.
Read Also : Revanth Reddy : కేసీఆర్ కు చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూం ఇల్లు కట్టిస్తా – రేవంత్ రెడ్డి